Poorna Clarity On Her Marriage Rumours
Poorna : ఒకప్పుడు హీరోయిన్‌గా అలరించిన పూర్ణ ఇప్పుడు టీవీ జడ్జిగా సందడి చేస్తున్న విషయం తెలిసిందే. పూర్ణ పలు చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. కాగా, పూర్ణ నిశ్చితార్థం గత జూన్ మాసంలోనే జరిగింది. యూఏఈకి చెందిన బిజినెస్ మేన్ షనీద్ ఆసిఫ్ అలీను ఆమె పెళ్లి చేసుకోనుంది. అయితే, వీరి పెళ్లి రద్దు అయిందంటూ ఇటీవల కథనాలు వస్తున్నాయి. దీనిపై పూర్ణ స్పందించింది. ఒక్క ఫొటోతో ఊహాగానాలన్నింటికి చెక్ పెట్టింది. ‘ఎప్పటికీ అతడు నా వాడే..’ అంటూ ఫొటోపై కామెంట్ చేసింది. అంతేకాదు, లవ్ సింబల్స్ కూడా పోస్టు చేసి తమ అనుబంధం మరింత ప్రేమాస్పదం అని పేర్కొంది. ఆ ఫొటోలో పూర్ణ, షనీద్ సన్నిహితంగా ఉండడాన్ని చూడొచ్చు. దీంతో అనేక పుకార్లకు చెక్ పడింది.
క్లాసికల్ డ్యాన్సర్‌గా కెరీర్‌ను ప్రారంభించి.. ఆ తర్వాత హీరోయిన్‌గా స్థిరపడిన టాలెంటెడ్ యాక్ట్రెస్ పూర్ణ అలియాస్ సామ్నా కాసీం ఒకరు. పేరుకు మలయాళీ భామే అయినా.. తెలుగులో చాలా తక్కువ సమయంలోనే ఎవరికీ సాధ్యం కాని రీతిలో పాపులర్ అయింది. ఫలితంగా తెలుగులోని ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. హీరోయిన్ పూర్ణ ‘శ్రీ మహాలక్ష్మీ’ అనే సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత రవిబాబు దర్శకత్వంలో వచ్చిన హారర్ సినిమాలు ‘అవును’, ‘అవును 2′ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది.
Poorna Clarity On Her Marriage Rumours
ఈ క్రమంలోనే ‘సీమటపాకాయ్’, ‘సిల్లీ ఫెలోస్’, ‘అదుగో’, ‘రాజుగారి గది’, ‘మామ మంచు అల్లుడు కంచు’ సహా ఎన్నో చిత్రాల్లో మంచి పాత్రలు చేసింది. చాలా కాలం పాటు హీరోయిన్‌గా సందడి చేసిన పూర్ణ.. ఈ మధ్య కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పాత్రలు చేసింది. ఇప్పటికే ఆమె ‘తలైవి’ మూవీలో శశికళ పాత్రను పోషించి సత్తా చాటింది. అలాగే, బాలకృష్ణ ‘అఖండ’, వెంకటేష్ ‘దృశ్యం 2′ సహా ఎన్నో భారీ చిత్రాల్లో భాగం అయింది. అలాగే, నాని ‘దసరా’ మూవీలో విలన్ పాత్రను చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Roja : టాలీవుడ్‌లో హీరోయిన్‌గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
Insta Reel : వరంగల్‌లోని కొత్తవాడలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
Samantha : టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ ఫైనలైజ్ అయ్యే దిశగా సాగుతోంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తన…
Jr Ntr : స్టార్ హీరోలు రవితేజ , జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికి టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ…
Girl : ఇటీవల కొన్ని వీడియోలు సోషల్ మీడియాని తెగ షేక్ చేస్తుంటాయి. కొందరు మాట్లాడే మాటలు అందరిని ఆశ్చర్యపరుస్తుంటాయి.…
This website uses cookies.