Krishna : సినిమాలు ప్లాప్ అయితే ప‌ట్టించుకోలే.. ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్న‌ సూప‌ర్ స్టార్ కృష్ణ‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Krishna : సినిమాలు ప్లాప్ అయితే ప‌ట్టించుకోలే.. ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్న‌ సూప‌ర్ స్టార్ కృష్ణ‌

 Authored By mallesh | The Telugu News | Updated on :29 May 2022,4:30 pm

Krishna : టాలీవుడ్ జేమ్స్ బాండ్ సూప‌ర్ స్టార్ కృష్ణ గురించి తెలుగు ప్ర‌జ‌ల‌కు ప్య‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల‌తో స్టార్ హీరోగా ఎదిగారు. తెలుగు ఇండస్ట్రీకి కొత్త‌ద‌నాన్ని ప‌రిచ‌యం చేసిన‌ గొప్ప‌న‌టుడు కూడా. తేనెమ‌నుసులు సినిమాతో ఇండ‌స్ట్రీలోరి అడుగుపెట్టిన సూప‌ర్ స్టార్ ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించి ఎవ‌ర‌కీ అంద‌నంత ఎత్తుకు ఎదిగారు. ఇక అల్లూరీ సీతారామ‌రాజు అంటే ట‌క్కున గుర్తుకువ‌చ్చే పేరు కృష్ణ. ఈ పాత్ర‌లో కృష్ణ న‌ట‌న‌తో ఓ రేంజ్ లో ఆక‌ట్టుకున్నాడు. అలాగే టాలీవుడ్ కి కౌబాయ్, జేమ్స్ బాండ్ వంటి పాత్ర‌లను పరిచ‌యం చేసిన ఘ‌న‌త కృష్ణ‌కే ద‌క్కుతుంది.నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగానే కాకుండా తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేశాడు. ప్రయోగాలకు కేరాఫ్‌గా నిలుస్తూ కొత్త‌గా ట్రై చేసేవాడు కృష్ణ‌. తెలుగు ప్రేక్షకులకు ఆయనే ఫస్ట్ కౌబాయ్, జేమ్స్ బాండ్ కూడా.

గుంటూరు జిల్లా తెనాలిలో 1943 మే 31న జన్మించిన కృష్ణ ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో తేనె మనసులు సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. మొద‌టి సినిమాతోనే సూప‌ర్ హిట్ అందుకున్నారు. కృష్ణ ఇప్ప‌టివ‌ర‌కు 340 పైగా సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించాడు.అలాగే పద్మాలయా సంస్థ ద్వారా పలు విజయవంతమైన చిత్రాలు తీశాడు. కాగా కృష్ణ సినిమాల్లోనే కాకుండా రాజ‌కీయాల్లో కూడా కీల‌కంగా ఉన్నారు. 1989లో కృష్ణ కాంగ్రెస్ తరఫున ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించాడు. కాగా మే 31న కృష్ణ బ‌ర్త్ డే ఉండ‌టంతో కూతురు మంజుల ఘ‌ట్ట‌మ‌నేని ఓ ఇంట‌ర్వ్యూ చేసింది. సూప‌ర్ స్టార్ కృష్ణ‌తో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు అడిగింది. ఈ సంద‌ర్భంగా ఓ ప్రోమో రిలీజ్ చేశారు. ఫుల్ వీడియో బ‌ర్త్ డే రోజు రిలీజ్ చేయ‌నున్నారు.

i dont care if the movies flop krishna who shared interesting things

i dont care if the movies flop krishna who shared interesting things

కాగా ఈ ప్రోమో లో మంజుల కృష్ణతో హీరో అవ్వాలనే ఐడియా ఎలా వచ్చింద‌ని అడగ్గా తాను ఏ ఉద్యోగం చేయను.. సినిమా హీరో అవ్వాలని ఏ ఉద్యోగం చేయలేదని చెప్పారు. అలాగే త‌ను చిన్నపిల్లోడిలా ఉన్నాన‌ని అన్నార‌ని చెప్పారు. అలాగే మేము ఓ పిక్చర్ తీయాలని అనుకుంటున్నాం. కాగా గూఢచారి 116 సినిమాలో హీరోగా చేయ‌మ‌ని అడ్వాన్స్ వెయ్యి రూపాయలు తీసుకోమ‌ని ఇచ్చార‌ని గుర్తుచేసుకున్నారు. అలాగే ఫ్యామిలీ ఎందుకు అంత ఇంపార్ట్ టెంట్ అని అడ‌గ్గా తనకు పిల్లలంటే ఎంతో ఇష్టమని అందుకే రెండింటిని బ్యాలెన్స్ చేయగలినని చెప్పారు.

ఇక హీరో మ‌హేశ్ బాబుతో చిన్న‌ప్పుడే సినిమాలు ఎలా చేమ‌గ‌లిగార‌ని.. అదంతా ప్లాన్ తో చేశారా..? లేక అలా జ‌రిగిందా అని మంజుల అడిగింది. ఓ సినిమా షూటింగ్ జ‌రుగుతుండ‌గా మ‌హేశ్ కొంచెం దూరంలో కూర్చుని చూస్తున్నాడ‌ని.. త‌ను వెళ్లి యాక్టింగ్ చేస్తావా అంటే చేయ‌న‌ని స్టూడియో అంత ప‌రిగెత్తాడ‌ని గుర్తు చేశారు. అలాగే ప్లాప్ సినిమాల‌ను ఎలా మ్యానేజ్ చేశార‌ని అడ‌గ్గా.. 12 సినిమాలు ప్లాప్ అయ్యాయ‌ని అవ‌న్నీ కూడా మంచి పిక్చ‌ర్స్ అని అయితే ఆ స‌మ‌యంలో బుక్ చేయ‌డం కూడా మానేశార‌ని అన్నారు. ఇక అప్పుడే సొంతంగా పాడిపంట‌లు అనే మూవీ చేసిన‌ట్లు చెప్పుకొచ్చారు. అలాగే మ‌హేశ్ పోకిరి సినిమా చూసిన‌ప్పుడే ఇది రికార్డులు బ్రేక్ చేస్త‌ద‌ని చెప్పిన‌ట్లు తెలిపారు. మ‌రిన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు మే 31న తెలియ‌నున్నాయి.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది