
Krishnam Raju Daughter Praseeda Got Loss In Prabhas Radhe Shyam Movie
Krishnam Raju : రెబల్ స్టార్ కృష్ణం రాజు గారు రీసెంట్‌గా కాలం చేసిన విషయం తెలిసిందే. ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు. కృష్ణం రాజు గారు తుదిశ్వాస విడిచారని తెలిసి స్టార్ హీరోలు, నటీనటులు, పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో రెబల్ స్టార్ అంత్యక్రియలు నిర్వహించగా.. ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, హీరో ప్రభాస్ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ దృశ్యాలు అందరినీ కలిచివేశాయి.
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణం రాజు సెప్టెంబర్ 11వ తేదిన ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచాడు. ఆయనకు కిడ్నీ సమస్యతో ఆస్పత్రిలో జాయిన్ అవ్వగా.. గుండెపోటుతో మరణించాడని వైద్యులు వెల్లడించారు. తెలుగు చిత్రపరిశ్రమకు కృష్ణంరాజు చాలా సేవలు అందించారు. విలక్షణమైన పాత్రల్లో మెప్పించిన ఆయన..నిర్మాతగా కూడా గుర్తింపు సంపాదించుకున్నారు.
Krishnam Raju Daughter Praseeda Got Loss In Prabhas Radhe Shyam Movie
ఇండస్ట్రీలో రెబల్ స్టార్ వారసుడిగా ప్రభాస్ ప్రస్తుతం స్టార్ హీరోగా ఎదిగాడు. బాహుబలి సినిమా అనంతరం ప్రభాస్ ఏకంగా పాన్ ఇండియన్ స్టార్ గా అవతరించాడు.కృష్ణం రాజుగారికి ముగ్గురు కూతుర్లు ఉన్నారు. అందుకే తన వారసుడిగా ప్రభాస్‌ను ప్రకటించాడు. ఇక ప్రభాస్ పెళ్లి చూడటం తన కల అని చాలా సార్లు చెప్పుకొచ్చిన ఆయన.. తన చివరి కోరిక నెరవేరకుండానే కన్నుమూశాడు.
కృష్ణంరాజు గారి పెద్ద కూతురు సాయి ప్రసీదా ఇండస్ట్రీలోకి నిర్మాతగా రాణిస్తున్నారు. రాధే శ్యామ్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన ప్రసిదా.. భారీగా నష్టపోయిందట..ఈ సినిమాకు ఏకంగా రూ.350 కోట్లు ఖర్చు పెట్టిన మూవీ మేకర్స్.. హిట్ అవుతుందని చాలా అంచనాలు పెట్టుకున్నారు. కానీ అనుకోకుండా సినిమా ప్లాప్ కావడంతో సుమారు రూ.100కోట్లు లాస్ వచ్చిందట.. దీంతో రాజుగారు తన కూతురి భవిష్యత్ కోసం ఆ వంద కోట్ల నష్టాన్నిఆయనే భరించారట.. దీనికి సంబంధించిన వార్తలు ప్రస్తుతం వైరల్ అవుతుండగా.. ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియాల్సి ఉంది.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.