Breaking : హాస్పిటల్‌లో చేరిన రెబల్ స్టార్ కృష్ణంరాజు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Breaking : హాస్పిటల్‌లో చేరిన రెబల్ స్టార్ కృష్ణంరాజు..!

 Authored By praveen | The Telugu News | Updated on :14 September 2021,2:35 pm

టాలీవుడ్ సీనియర్ నటుడు, రెబల్ స్టార్ కృష్ణం రాజు హెల్త్‌ బాగానే ఉన్నట్లు ఆయన కుటుంబసభ్యులు మంగళవారం ప్రకటించారు. నార్మల్ హెల్త్ చెకప్‌లో భాగంగానే కృష్ణం రాజు పలు వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపారు. కృష్ణంరాజు త్వరలో యూకేకు పర్యటనకు వెళ్లనున్నారని, ఈ నేపథ్యంలోనే ఆయన హెల్త్ చెకప్ చేయించుకున్నట్లు పేర్కొన్నారు.

krishnam raju family members gave clarity on health

krishnam raju family members gave clarity on health

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై కృష్ణంరాజు వైద్యులను అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. ఇకపోతే కృష్ణంరాజు తన నివాసంలో కాలుజారి పడగా, తుంటి ఎముక విరిగిందని, అందుకే ఆయన అపోలో ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు వచ్చాయి.కృష్ణంరాజు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ క్రమశిక్షణా సంఘం చైర్మన్‌గా ఉన్న సంగతి అందిరికీ విదితమే.

 

ఈ సంగతలు పక్కనబెడితే కృష్ణంరాజు నటవారసుడిగా ఆయన అన్న కుమారుడు ప్రభాస్ సత్తాచాటుతున్నాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు.

 

 

 

Advertisement
WhatsApp Group Join Now

praveen

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది