Krithi Shetty : గ్లామర్ షోలో టాప్ గేర్ వేసిన బేబమ్మ.. స్లీవ్ లెస్ అందాల బ్లాస్ట్..!
Krithi Shetty : ఉప్పెనతో తొలి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత హిట్ ఫాం కొనసాగించడంలో ఫెయిల్ అయ్యింది. వరుస సినిమాలైతే చేసింది కానీ అవేవి అమ్మడికి సక్సెస్ ఇవ్వలేదు. యువ హీరోలతో వరుసగా అరడజనుకి పైగా సినిమాలు చేసిన కృతి శెట్టి ఇప్పుడు సినిమాలు లేక ఖాళీ అయిపోయింది. ఐతే సినిమాలు లేకపోతేనేంటి తన గ్లామర్ ఫోటో షూట్ తో ఫాలోవర్స్ ని అలరిస్తుంది అమ్మడు.
మొదట్లో ఫోటో షూట్స్ లో కూడా నిండుగా కప్పుకుని కనిపించిన కృతి శెట్టి సినిమా నీళ్లు పడే సరికి గ్లామర్ షోకి తెర లేపింది. తన స్లీవ్ లెస్ అందాలతో కృతి శెట్టి చేస్తున్న షోకి కుర్రాళ్లంతా పిచ్చెక్కిపోతున్నారు. ఉప్పెనలో బేబమ్మగా క్యూట్ లుక్స్ తో అలరించిన కృతి శెట్టి కొన్నాళ్లు టాలీవుడ్ ని ఏలేస్తుంది అన్న భావన రాగా.. తన సినిమాల ఎంపిక వల్ల అమ్మడి కెరీర్ స్ట్రగుల్స్ లో పడేసుకుంది.
![Krithi Shetty గ్లామర్ షోలో టాప్ గేర్ వేసిన బేబమ్మ స్లీవ్ లెస్ అందాల బ్లాస్ట్](https://thetelugunews.com/wp-content/uploads/2024/12/Krithi-Shetty1.jpg)
Krithi Shetty : గ్లామర్ షోలో టాప్ గేర్ వేసిన బేబమ్మ.. స్లీవ్ లెస్ అందాల బ్లాస్ట్..!
Krithi Shetty : స్కిన్ షోకి ఫాలోవర్స్..
ఇక చేసేది ఏమి లేక అవకాశాల కోసం ఎదురుచూస్తూ గ్లామర్ షోతో ఎట్రాక్ట్ చేస్తుంది. ముఖ్యంగా టాప్ గేర్ లో బేబబ్బ చేస్తున్న స్కిన్ షోకి ఫాలోవర్స్ పిచ్చెక్కిపోతున్నారు. లేటెస్ట్ గా బ్లూ కలర్ శారీ, స్లీవ్ లెస్ జాకెట్ తో కృతి శెట్టి ఫ్రీ షో ఆడియన్స్ మైండ్ డిస్ట్రబ్ చేస్తుంది. కచ్చితంగా అమ్మడికి ఇక మీదట గ్లామర్ రోల్స్ వచ్చినా చేసేస్తుంది అనిపించేలా కృతి హింట్ ఇచ్చేస్తుంది. కెరీర్ మొత్తం ఇలానే కేవలం అభినయం ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేస్తా అంటే కుదరని పని. అందుకే బేబమ్మ తన గ్లామర్ షోతో మేకర్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది. లేటేస్ట్ గా బ్లూ కలర్ శారీ. డిజైనర్ స్లీవ్ లెస్ జాకెట్ ఫోటో షూట్ చూసిన ఎవరైనా కృతి శెట్టికి పిలిచి మరీ అవకాశాలు ఇస్తారు. ఇదే రేంజ్ లో రెచ్చిపోతే మాత్రం కృతికి ఆఫర్లు కచ్చితంగ వచ్చి తీరుతాయని చెప్పొచ్చు… Krithi Shetty Glamour Blast Latest Photoshoot , Krithi Shetty, Uppena, Krithi Shetty Photoshoot, Tollywood