Rajamouli : రాజమౌళిని జైల్లో పెట్టాలంటూ ఫైర్.. చెత్త సినిమా ఆర్ఆర్ఆర్ తీసాడంటూ ఆగ్రహం
Rajamouli :వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తెలుగు సినిమా స్థాయి పెంచుతున్న దర్శకుడు రాజమౌళి. బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని ఖండాంతరాలు దాటించిన రాజమౌళి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో మరింత పెంచబోతున్నాడు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కలెక్షన్స్ పరంగా గత సినిమాలను ‘ఆర్ఆర్ఆర్’ దాటివేస్తుందని చెబుతున్నారు. ఈ అంచనాల నేపథ్యంలో సినిమా ఓపెనింగ్స్ ఎలా ఉండబోతున్నాయి? తొలి రోజు ఈ సినిమా ఎంత వసూళ్లు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు ఐదు వందల కోట్లు జరిగినట్లు సమాచారం.
Rajamouli కోపం కట్టలు తెంచుకుంది..
కొద్ది సేపటి క్రితం విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా ఆడియన్స్ ను ఉర్రూతలూగిస్తుంది. సీతరామారాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్ గా ఎన్టీఆర్.. ఓ పాపకోసం సాగిన కథతో ట్రిపుల్ ఆర్ దుమ్ము రేపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కామన్ ఆడియన్స్ తో పాటు సినిమా సెలబ్రిటీలు కూడా ట్రిపుల్ ఆర్ పై తమ అభిప్రాయాలు సోషల్ మీడియాలో పెడుతున్నారు. అందరూ పాజిటీవ్ గా స్పందిస్తుండగా.. బాలీవుడ్ యాక్టర్, క్రిటిక్.. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అయిన కెఆర్కే మాత్రం సినిమాపై మండి పడ్డారు. రాజమౌళిపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

krk fire on rajamouli RRR Movie
ఈ సినిమా చేయడం తప్పు మాత్రమే కాదని.. 600 కోట్ల ఖర్చుతో ఇంత చెత్త సినిమా చేసినందుకు డైరెక్టర్ రాజమౌళికి కనీసం 6 నెలలు జైలు శిక్ష వేయాంటూ వివాదాస్పదంగా ట్వీట్ చేశాడు కమల్ రషిద్ ఖాన్. భారతదేశ చరిత్రలో ఇలాంటి ధారుణమైన సినిమా రాలేదన్నారు రషీద్. సినిమా హిస్టరీలోనే ఇది చెత్త సినిమా అంటూ నోరు పారేసుకున్నాడు ఖాన్. ఈ సందర్భంగా మరికొన్ని అత్యంత ధారుణమైన వ్యాఖ్యలు చేశారు కమల్. ఈ సినిమా మనిషి మెదుడు కణాలను నాశనం చేస్తుందంటూ ట్వీట్ చేశారు బాలీవుడ్ యాక్టర్. ఇతను గతంలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సినిమాలపై కూడా ఇలానే తన ఆక్రోశం చూపించిన విషయం తెలిసిందే.