Kumari Aunty ఏంటి మనం అనుకున్నది నిజమైందా.. బిగ్ బాస్ షోలోకి కుమారీ ఆంటీ..!
Kumari Aunty : ఒక్క డైలాగ్‌తో ఓవర్‌నైట్ స్టార్ అయింది కుమారీ ఆంటి. హైదరాబాద్‌లోని రోడ్ సైడ్ మీల్స్ బిజినెస్ చేస్తోన్న ఈమె పేరు సోషల్ మీడియాలో తెగ మార్మోగిపోయింది. రెండు లివర్స్ ఎక్స్ ట్రా అనే డైలాగ్‌తో కుమారీ ఆంటీకి చాలా పాపులారిటీ వచ్చింది.ఆమె వంట రుచి చూసేందుకు వందలాది మంది క్యూ కట్టారు. అయితే జనాల రద్దీ పెరగడం, వాహనాల రాకపోకలను ఇబ్బంది కలగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి కుమారీ ఆంటీ బిజినెస్ ను క్లోజ్ చేయించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా జోక్యం చేసుకుని ఆమె ఫుడ్ బిజినెస్ హోటల్ ను ఓపెన్ చేయించారు. దీంతో కుమారీ ఆంటీ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోయింది.
కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, టీవీ ఛానెల్స్ ఆమె ఇంటర్వ్యూలు తీసుకున్నాయి. ఇప్పటికే పలు టీవీ షోల్లో ఎంట్రీ కూడా ఇచ్చింది కుమారీ ఆంటీ. అదే సమయంలో ఆమెపై ట్రోల్స్ కూడా నడిచాయి. రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్ చేసుకునే కుమారీ ఆంటీనీ మీ క్రేజ్ తో బిగ్ బాస్ పంపించేలా ఉన్నారంటూ నెట్టింట పోస్టులు కూడా దర్శన మిచ్చాయి. అయితే ఇప్పుడీ మాటలే నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. ఈ సీజన్ తెలుగు బిగ్ బాస్ లోకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం. మరి కొన్ని నెలల్లో సీజన్ 8 మొదలైపోతున్న నేపథ్యంలో ఇప్పటికే కంటెస్టెంట్ల కోసం బిగ్ బాస్ టీమ్ వెతుకులాట ప్రారంభించింది.
Kumari Aunty ఏంటి మనం అనుకున్నది నిజమైందా.. బిగ్ బాస్ షోలోకి కుమారీ ఆంటీ..!
ఇంకా ఆమె తుది నిర్ణయం చెప్పలేదని తెలుస్తోంది. గతంలో కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్నవారిని బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరిగింది కానీ సీజన్ మొదలయ్యాక వాళ్ళు హౌస్ లో కనిపించేవారు కాదు. మరి కుమారి ఆంటీ విషయం ఏం జరుగుతుందో తెలియాలంటే సీజన్ 8 ప్రారంభమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. కుమారి ఆంటీ బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చాక ఎలా నెగ్గుకు వస్తుంది అనేది మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా ఉంది. ఒక్కొక్కళ్లు బిగ్ బాస్ గురించి తెలుసుకొని బాగా రాటుదేలి ఉంటారు. కుమారి ఆంటీ వారితో ఎలా పోటీపడుతుందనేది ఆసక్తికరంగా మారింది.
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
This website uses cookies.