
Ys Jagan : జగన్‌ని ఓడించి మెల్లగా అక్కడ నుండి జారుకున్న సలహాదారులు..!
Ys Jagan : ఏపీలో రాజకీయాలు ఎంత ఆసక్తికరంగా మారాయో మనం చూశాం. వైనాట్ 175 అన్న జగన్ 11 స్థానాలకే పరిమితం అయ్యాడు. దీంతో తన ఓటమికి లెక్కలు వేసుకుంటున్నాడు జగన్. అయితే అధికారంలో ఉండగా పార్టీ కోసం పనిచేసిన వారు, సాధారణ కార్యకర్తలు, అభిమానుల్ని పూర్తిగా దూరం చేసేసి జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌కు మాత్రమే పరిమితం చేయడంలో కొందరు సలహాదారుల పాత్ర ఉంది అని అర్ధం అవుతుంది. కాగితాలపై రాసిచ్చి వాటిని మాత్రమే చదవడానికి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని పరిమితం చేయగలిగారు. ఐదేళ్లలో మీడియాతో మాట్లాడకుండా, ప్రశ్నించే అవకాశమే ఎవరికి దక్కనివ్వకుండా చేయడంలో ఇలాంటి సలహాదారులే ప్రధాన పాత్ర పోషించారు.
ఇప్పుడు ఆయనని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించి, వైసీపీ ఓటమిలో తమ వంతు పాత్ర పోషించిన సలహాదారులు ఎవరు ఇప్పుడు తాడేపల్లిలో కనిపించడం లేదని ప్రచారం జరుగుతోంది. గత ఐదేళ్లలో ఉపాధి హామీ పథకంలో భాగంగా సొంత వారికి పెద్ద ఎత్తున సలహాదారుల పోస్టుల్ని వైసీపీ కట్టబెట్టింది. వారిలో చాలామంది నామమాత్రంగా సర్దుకుపోయినా నలుగురైదుగురు మాత్రం బాగా పెత్తనం చెలాయించారు. ఏ మంత్రి ఏమి చేయాలన్న, ఏ శాఖలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న సదరు సలహాదారుడికే బాధ్యత అప్పగించేవారు. ఫక్తు ప్రాంతీయ పార్టీగా వైసీపీని నడిపించి బొక్కబొర్లా పడ్డానికి సదరు సలహాదారుడే కారణమనే విమర్శలు ఉన్నాయి.
Ys Jagan : జగన్‌ని ఓడించి మెల్లగా అక్కడ నుండి జారుకున్న సలహాదారులు..!
సర్వేలు, నివేదికల పేరిట కోట్లు కూడబెట్టకోవడం వెనుక కూడా కొందరు సలహాదారుల ప్రమేయం ఉంది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో అధికారాన్ని నిలబెట్టుకోవడం కూడా ముఠాలుగా జట్టుకట్టి జగన్‌ను నిండా ముంచేశారనే వాదనలు ఉన్నాయి. ప్రధానంగా ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా వీరు పనిచేశారనే విమర్శలు ఉన్నాయి. అధికార పార్టీ తరపున గత ఏడాదిన్నర కాలంలో సాగిన ప్రచారంలో కూడా సిఎంఓలో పనిచేసిన వ్యక్తులే బినామీ పేర్లతో సొమ్ము కూడబెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం పార్టీ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఇక జగన్‌ని నిండా ముంచేసిన సలహాదారుల్లో పలువురు ఇళ్లు కూడా ఖాళీ చేసి తాడేపల్లి నుంచి మాయం అయిపోయారు అని టాక వినిపిస్తుంది. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు బీరాలు పలికిన వారు కనీసం ఫోన్లకు కూడా అందుబాటులో లేకుండా పోయారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
OTT Release Ugly Story : ఇటీవల కాలంలో చిన్న సినిమాలకు ఓటీటీ వేదికలు పెద్ద వరంగా మారుతున్నాయి. థియేటర్లలో…
Murder Mystery After 40 Years : కొన్ని నేరాలు కాలగర్భంలో కలిసిపోతాయని అనుకుంటారు. కానీ మనసులోని పాపభీతి మాత్రం…
Free Railways Ticket : భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థల్లో ఒకటి. ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులు…
Students Free Bus Passes : విద్యార్థుల విద్యాభ్యాసానికి మరింత ప్రోత్సాహం అందించే దిశగా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం…
300 Units Free Electricity : విద్యుత్ బిల్లుల భారం తగ్గించాలని భావిస్తున్న కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన PM…
Hai Jawani Toh Ishq Hona Hai Movie Review : బాలీవుడ్ స్టార్ Varun Dhawan హీరోగా, Mrunal…
Rythu Bharosa : తెలంగాణ Telangana రైతులకు Farmers ప్రభుత్వం మరో శుభవార్త అందించేందుకు సిద్ధమవుతోంది. రైతు భరోసా పథకం…
Upasana Peddi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ…
World Environment Day : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రముఖ హరిత ప్రాంతమైన KBR నేషనల్ పార్క్…
Thread Pochampally : తెలంగాణ చేనేత కళకు మరింత ప్రాచుర్యం కల్పించడంతో పాటు నేతన్నల జీవనోపాధిని బలోపేతం చేయాలనే లక్ష్యంతో…
Uppal MMC Office : హైదరాబాద్ నగర అభివృద్ధి దిశగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కీలక చర్యల్లో మల్కాజిగిరి మున్సిపల్…
Guava Farming Success Story : ప్రస్తుతం చాలా మంది యువత ఉన్నత చదువులు పూర్తి చేసి మంచి ఉద్యోగాల…
This website uses cookies.