Kumari Aunty ఏంటి మ‌నం అనుకున్న‌ది నిజ‌మైందా.. బిగ్ బాస్ షోలోకి కుమారీ ఆంటీ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kumari Aunty ఏంటి మ‌నం అనుకున్న‌ది నిజ‌మైందా.. బిగ్ బాస్ షోలోకి కుమారీ ఆంటీ..!

 Authored By ramu | The Telugu News | Updated on :17 June 2024,11:30 am

ప్రధానాంశాలు:

  •  Kumari Aunty ఏంటి మ‌నం అనుకున్న‌ది నిజ‌మైందా.. బిగ్ బాస్ షోలోకి కుమారీ ఆంటీ..!

Kumari Aunty : ఒక్క డైలాగ్‌తో ఓవ‌ర్‌నైట్ స్టార్ అయింది కుమారీ ఆంటి. హైదరాబాద్‌లోని రోడ్ సైడ్ మీల్స్ బిజినెస్ చేస్తోన్న ఈమె పేరు సోషల్ మీడియాలో తెగ మార్మోగిపోయింది. రెండు లివ‌ర్స్ ఎక్స్ ట్రా అనే డైలాగ్‌తో కుమారీ ఆంటీకి చాలా పాపులారిటీ వ‌చ్చింది.ఆమె వంట రుచి చూసేందుకు వందలాది మంది క్యూ కట్టారు. అయితే జనాల రద్దీ పెరగడం, వాహనాల రాకపోకలను ఇబ్బంది కలగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి కుమారీ ఆంటీ బిజినెస్ ను క్లోజ్ చేయించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా జోక్యం చేసుకుని ఆమె ఫుడ్ బిజినెస్ హోటల్ ను ఓపెన్ చేయించారు. దీంతో కుమారీ ఆంటీ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోయింది.

Kumari Aunty ప్ర‌చారం నిజం కాబోతుందా?

కొన్ని యూట్యూబ్‌ ఛానెల్స్, టీవీ ఛానెల్స్ ఆమె ఇంటర్వ్యూలు తీసుకున్నాయి. ఇప్పటికే పలు టీవీ షోల్లో ఎంట్రీ కూడా ఇచ్చింది కుమారీ ఆంటీ. అదే సమయంలో ఆమెపై ట్రోల్స్ కూడా నడిచాయి. రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్ చేసుకునే కుమారీ ఆంటీనీ మీ క్రేజ్ తో బిగ్ బాస్ పంపించేలా ఉన్నారంటూ నెట్టింట పోస్టులు కూడా దర్శన మిచ్చాయి. అయితే ఇప్పుడీ మాటలే నిజమయ్యేలా క‌నిపిస్తున్నాయి. ఈ సీజన్ తెలుగు బిగ్ బాస్ లోకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం. మరి కొన్ని నెలల్లో సీజన్ 8 మొదలైపోతున్న నేపథ్యంలో ఇప్పటికే కంటెస్టెంట్ల కోసం బిగ్ బాస్ టీమ్ వెతుకులాట ప్రారంభించింది.

Kumari Aunty ఏంటి మ‌నం అనుకున్న‌ది నిజ‌మైందా బిగ్ బాస్ షోలోకి కుమారీ ఆంటీ

Kumari Aunty ఏంటి మ‌నం అనుకున్న‌ది నిజ‌మైందా.. బిగ్ బాస్ షోలోకి కుమారీ ఆంటీ..!

ఇంకా ఆమె తుది నిర్ణయం చెప్పలేదని తెలుస్తోంది. గతంలో కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్నవారిని బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరిగింది కానీ సీజన్ మొదలయ్యాక వాళ్ళు హౌస్ లో కనిపించేవారు కాదు. మరి కుమారి ఆంటీ విషయం ఏం జరుగుతుందో తెలియాలంటే సీజన్ 8 ప్రారంభమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. కుమారి ఆంటీ బిగ్ బాస్ హౌజ్‌లోకి వ‌చ్చాక ఎలా నెగ్గుకు వ‌స్తుంది అనేది మాత్రం ప్ర‌స్తుతం ఆస‌క్తిక‌రంగా ఉంది. ఒక్కొక్క‌ళ్లు బిగ్ బాస్ గురించి తెలుసుకొని బాగా రాటుదేలి ఉంటారు. కుమారి ఆంటీ వారితో ఎలా పోటీప‌డుతుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది