Sai Pallavi | సాయి ప‌ల్ల‌వి బికినీ లుక్ వైర‌ల్.. ఏంటీ ఈ చేంజ్ అంటూ నెటిజ‌న్స్ కామెంట్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sai Pallavi | సాయి ప‌ల్ల‌వి బికినీ లుక్ వైర‌ల్.. ఏంటీ ఈ చేంజ్ అంటూ నెటిజ‌న్స్ కామెంట్స్

 Authored By sandeep | The Telugu News | Updated on :22 September 2025,6:00 pm

Sai Pallavi | సినీ ఇండస్ట్రీలో ‘నేచురల్‌ బ్యూటీ’గా గుర్తింపు తెచ్చుకున్న నటి సాయి పల్లవి టాలీవుడ్‌లో లేడీ పవర్‌ స్టార్‌ అనే రేంజ్‌లో ఫాలోయింగ్ సంపాదించింది. అయితే ఈ భామ తాజాగా బికినీలో దర్శనమివ్వడం అందరినీ షాక్‌కి గురిచేస్తోంది. ఇంతవరకు ఆమెను ఎప్పుడూ బోల్డ్‌ అవతారంలో చూసి షాక్ అవుతున్నారు. తన చెల్లెలు పూజా కన్నన్‌తో కలిసి విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సాయి పల్లవి సముద్ర తీరంలో ఇలా బికినీలో క‌నిపించింది.

#image_title

బికినీ లుక్ ..

అక్కాచెల్లెళ్లిద్దరూ కలిసి బీచ్‌లో స‌ర‌దాగా ఎంజాయ్ చేస్తూ ఉన్న క్షణాలను కెమెరాలో బంధించగా ఆ ఫొటోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో దుమారం రేగింది. ఇప్పటి వరకు చాలా పద్ధతిగా కనిపించిన సాయిపల్లవి ఇలా మారిపోతుందని అస్సలు ఊహించలేదు’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అభిమానులు కూడా ఈ ఫొటోలు చూసి ఆశ్చర్యపోతున్నారు గ్లామర్‌కు దూరంగా ఉంటూ అభినయమే తనకు ఆయుధం అని నిరూపించుకున్న సాయిపల్లవి ఇలా క‌నిపించ‌డం హాట్ టాపిక్‌గా మారింది.

సాయిపల్లవి చెల్లి పూజా కన్నన్ గతేడాది పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్‌కాగా, ఆమెని క‌లిసేందుకు సాయి ప‌ల్ల‌వి వెళ్లింది. అక్క‌డ త‌న చెల్లెలితో క‌లిసి బికినీ వేసుకుందని, ఈ విషయాన్ని బూతద్దంలో చూడాల్సిన పనిలేదంటున్నారు. కనీసం బయట కూడా ఆమెకు నచ్చిన డ్రెస్ వేసుకోకూడదా అని నిలదీస్తున్నారు. సాయిపల్లవి ప్రస్తుతం హిందీలో తెరకెక్కుతోన్న ‘రామాయణ’ మూవీలో సీతగా నటిస్తోంది. సుమారు 4వేల కోట్ల రూపాయలతో రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ ప్రాజెక్టులో రాముడిగా రణ్‌బీర్ కపూర్ నటిస్తున్నాడు. సీతాదేవి క్యారెక్టర్‌లో సాయి ప‌ల్ల‌వి న‌టిస్తుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది