Lakshmi Parvathi : లక్ష్మీ పార్వతి నారా లోకేష్‌ని అంత మాట అనిందేంటి..!
ప్రధానాంశాలు:
Lakshmi Parvathi : జూ.. ఎన్టీఆర్.. లక్ష్మీ పార్వతి.. నారా లోకేష్‌ని అంత మాట అనిందేంటి..!
Lakshmi Parvathi : నందమూరి తారక రామరావు.. తెలుగు ప్రజలకు ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కథా నాయకుడిగా, రాజకీయ నాయకుడిగా చరిత్రపై చెరగని ముద్ర వేశారు ఎన్టీఆర్. సినిమాల్లో ఎన్నో అపురూప పాత్రలను పోషించి విశ్వ విఖ్యాత నట సార్వభౌమ కీర్తిని సంపాదించుకున్నారు. అలాగే రాజకీయాల్లోకి వచ్చి అంతకంటే ఎక్కువ పేరును గడించారు. అయితే ఆయన పేరు చెప్పుకొని చాలా మంది సత్తా చాటుతున్నారు.

Lakshmi Parvathi : లక్ష్మీ పార్వతి నారా లోకేష్‌ని అంత మాట అనిందేంటి..!
Lakshmi Parvathi లక్ష్మీ పార్వతి హాట్ కామెంట్స్..
ఎన్టీఆర్ .. ఒకానొక సందర్భంలో లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకోవడం ఆ సమయంలో నందమూరి ఫ్యామిలీ వ్యతిరేఖించడం మనం చూశాం. అయితే ఈ మధ్య లక్ష్మీ పార్వతి చాలా యాక్టివ్ అయ్యారు. వైయస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న లక్ష్మీ పార్వతి.. సంప్రదాయం ప్రకారం ఎన్టీఆర్‌కు కూతురు కొడుకైన లోకేష్ ఎలా వారసుడు అవుతాడు అని ప్రశ్నించింది.
నందమూరి కుటుంబం నుంచి వచ్చిన వారే ఎన్టీఆర్ వారసులు . చంద్రబాబు, లోకేష్‌లు అవినీతి, అడ్డగోలు సంపాదన, రెడ్ బుక్ పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టారు అంటూ వైయస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి కామెంట్ చేశారు. ఇప్పుడు లక్ష్మీ పార్వతి చేసిన కామెంట్స్ నెట్టింట చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇప్పుడు దీనిపై తెలుగు తమ్ముళ్లు ఏమైన స్పందిస్తారా అనేది చూడాలి.