Lasya Manjunath: నాదీ నక్కిలీసు గొలుసు అంటోన్న లాస్య.. వీడియో వైరల్

Authored By Cinema Desk | The Telugu News | Updated on: January 31, 2021, 7:12 pm

Lasya Manjunath: బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తరువాత లాస్యకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. దాన్ని లాస్య కాపాడుకుంటూ.. ఆ ఫాలోయింగ్‌ను ఇంకా పెంచుకునేందుకు బాగానే పాట్లు పడుతోంది. సోషల్ మీడియాలో మునుపటి కంటే ఎక్కువగా యాక్టివ్ అవుతోంది. రోజూ ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటోంది.వెరైటీ వెరైటీ వీడియోలను చేస్తూ జనాలను ఆకట్టుకునేందుకు ట్రై చేస్తోంది.

Lasya Manjunath Dance video

Lasya Manjunath Dance video

లాస్య బిగ్ బాస్ షో నుంచి వచ్చాక ఎక్కువగా యూట్యూబ్ మీద ఫోకస్ పెట్టేసింది. యూట్యూబ్ చానెల్‌ను ఎక్కువగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేసింది. వరుసగా వీడియోలు చేయడం, అవి బాగా ట్రెండ్ అవ్వడం, మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టడంతో లాస్య ఫుల్ హల్చల్ చేసింది. ఇక ఆమె తన భర్త్, తన టీంతో కలిసి చేసే ఫన్నీ వీడియోలు సైతం బాగానే ఉంటున్నాయి. ఆ మధ్య లాస్య యూట్యూబ్ చానెల్ హ్యాక్ అవ్వడం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

లాస్య ఇప్పుడు తాజాగా ఓ డ్యాన్స్ వీడియోను షేర్ చేసింది. నాదీ నక్కిలీసు గొలుసు అనే పాట రెండు తెలుగు రాష్ట్రాలను ఎలా ఊపేసిందో అందరికీ తెలిసిందే. ఆపాటకు స్టెప్పులు వేయని వారెవ్వరూ ఉండరు. తాజాగా లాస్య కూడా తన టీంతో కలిసి నాదీ నక్కిలీసు గొలుసు అంటూ కాలు కదిపేసింది. మొత్తానికి ఈ వీడియో బాగానే వైరల్ అవుతోంది. లాస్య, నోయల్, హారిక నేడు ప్రారంభం కాబోతోన్న సుమ స్టార్ట్ మ్యూజిక్‌లో సందడి చేయబోతోన్నారు.

Cinema Desk

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp