
Lavanya – Raj Tarun : గత కొద్ది రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజ్ తరుణ్- లావణ్య వ్యవహారం ఎంత చర్చనీయాంశంగా మారిందో మనం చూశాం. లావణ్య మీడియా ముందుకు వచ్చి రాజ్ తరుణ్ గురించి అనేక ఆరోపణలు చేయడం, లావణ్య చేసేవన్నీ అబద్దపు ఆరోపణలు అని చెప్పి రాజ్ తరుణ్ వెళ్లిపోవడం మనం చూశాం.. అయితే అప్పట్నుంచి రాజ్ తరుణ్ బయటకి రాలేదు. తాజాగా రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా తిరగబడరా సామి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యారు. ఈ ఈవెంట్లో మీడియా అడిగే పలు ప్రశ్నలకి ఇద్దరూ సమాధానాలు ఇచ్చారు. లావణ్య వివాదం తర్వాత ఎందుకు బయటకు రాలేదరని మీడియా ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
నేను మనిషినే, నాకు బాధేస్తుంది. నేను ఎఫెక్ట్ అవుతాను. వాళ్ళ లాగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేను. నేను చాలా ఎఫెక్ట్ అయ్యాను. మన మంచితనాన్ని ఆసరాగా తీసుకొని ఇలా చేస్తే నాకు బాధ వేయదా? ఆ బాధతోనే ఇన్నాళ్లు బయటకు రాలేదు. నేను మామూలుగానే సెన్సిటివ్ పర్సన్ అందుకే బయటకి రాలేదు. నేను ఇంకా అలాగే ఉండేవాడిని ఇంట్లో. మా పేరెంట్స్, ఫ్యామిలీ అంతా ఎఫెక్ట్ అవుతున్నారు. అందుకే ఇవాళ మీ ముందుకు వచ్చి సమాధానాలు చెప్పాలని బయటకి వచ్చాను. నేను చాలా ధైర్యం తెచ్చుకొని బయటకి వచ్చాను. ఇంకా ఇలాంటివి అడిగి బాధపెట్టకండి. నేను ఏదైనా లీగల్ గా ప్రొసీడ్ అవుతాను. నా 32 ఏళ్ల జీవితం లో వేలాది మంది తెలిసి ఉన్నారు. ఎవరైనా ఒక్కరు వచ్చి నా మీద చెడుగా చెప్పమని చెప్పండి అని అన్నారు.
రాజ్ తరుణ్ కామెంట్స్ తర్వాత లావణ్య.. ఏకంగా రాజ్ తరుణ్ ఇంటికి వెళ్లింది. మాదాపూర్ కాకతీయ హిల్స్ లో రాజ్ తరుణ్ ఇంటి ముందు లావణ్య ఆందోళనకు దిగింది. ఇంటి తలుపులు తీయాలని లావణ్య గట్టిగట్టిగా కేకలు వేసింది. తనకు న్యాయం చేయాలని రాజ్ తరుణ్ తల్లిదండ్రులను కోరింది. రాజ్ తరుణ్ ఎక్కడున్నా వెంటనే రావాలని డిమాండ్ చేసింది. రాజ్ తరుణ్ తో తన రిలేషన్ పై పలు ఆధారాలతో రాజ్ తరుణ్ ఇంటికి వెళ్లింది లావణ్య. ప్రసాద్ ల్యాబ్ నుండి రాజ్ తరుణ్ తప్పించుకుని మాల్వి మల్హోత్రాతో వెళ్ళిపోయాడని లావణ్య అంది. చూస్తుంటే ఈ వ్యవహారంకి ఇప్పట్లో బ్రేక్ పడేలా కనిపించడం లేదు..
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.