Lavanya : నా తిండికి డబ్బులు కావాలన్నా మాల్వి మల్హోత్రా చెప్పాల్సిందే.. లావణ్య ఆవేదన..!
Lavanya : గత కొద్ది రోజులుగా లావణ్య, రాజ్ తరుణ్‌ల విషయం సోషల్ మీడియాలో ఎంత చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ – లావణ్య కేసు ట్విస్టుల మీద ట్విస్టులతో సాగుతోంది. తనను మోసం చేసి మరో అమ్మాయితో రాజ్ తరుణ్ ఎఫైర్ పెట్టుకున్నాడని లావణ్య నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అన్విక అన్న పేరుతో ఒకే ఇంట్లో ఉన్నామని.. అదే పేరుతో విదేశాలకు సైతం వెళ్లామని లావణ్య తెలిపింది. తాను గర్భం దాల్చితే రాజ్ తరుణే అబార్షన్ చేయించాడని ఆమె ఆరోపించింది. హీరోయిన్ మాల్వీ మల్హోత్రా ఎంటరయ్యాకే రాజ్‌తో తనకు దూరం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేసింది.
మొదట రాజ్ తరుణ్ నన్ను మోసం చేశాడంటూ మీడియా ముందుకు వచ్చిన లావణ్య.. అతనికి, తనకు మధ్య ఉన్న రిలేషన్ ఏంటనేది అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తూ వస్తుంది. అలాగే రాజ్ తరుణ్ తనను పెళ్లాడినట్లుగా, ఓసారి అబార్షన్ చేయించినట్లుగా కూడా చెప్పి.. అతనిపై పోలీసులకు కంప్లయింట్ చేసింది. ప్రేమ, పెళ్లి, అబార్షన్ వంటి అంశాలతో సాగిపోతున్న ఈ కథలో లావణ్య చెబుతున్న ప్రకారం విలన్ మాత్రం ‘తిరగబడరసామి’ హీరోయిన్ మాల్వి మల్హోత్రానే. రాజ్ తరుణ్ తనకి కావాలని, రాజ్ తరుణ్‌పైన తాను కేసు పెట్టలేదని లావణ్య అంటుంది.
Lavanya : నా తిండికి డబ్బులు కావాలన్నా మాల్వి మల్హోత్రా చెప్పాల్సిందే.. లావణ్య ఆవేదన..!
రాజ్ తరుణ్‌తో ఇప్పుడు లావణ్య ఉంటుంది. మాల్వి చెబితేనే నా తిండి తిప్పలకి ఆయన డబ్బులు పంపించేవాడు. ఈ యూట్యూబ్ థంబ్నెయిల్స్, కామెంట్స్ చూస్తే తట్టుకోలేకపోతున్నాను.రాజ్ తరుణ్ నా ప్రపంచం.. వస్తాడో, రాడో కానీ వస్తాడనే ట్రై చేస్తున్నాను అంటూ లావణ్య చెప్పుకొచ్చింది. రాజ్ తరుణ్‌తో రిలేషన్ పెట్టుకుని తన కాపురంలో నిప్పులు పోస్తుందనేది లావణ్య ప్రధాన ఆరోపణ అనేది తెలిసిన విషయమే. ఆరోపణే కాదు.. ఆధారాలు కూడా లావణ్య చూపిస్తోంది. ఇదిలా ఉంటే.. మాల్వి మల్హోత్రా మాత్రం నాకేం తెలియదు.. జస్ట్ అతని సినిమాలో హీరోయిన్‌ని మాత్రమే అంటూ.. ఆమె కూడా లావణ్యపై కంప్లయింట్ చేసింది.
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
This website uses cookies.