Lavanya Tripathi : హీరోయిన్‌కు టైటిల్ రోల్ రావడం కష్టం. అయితే అదృష్టం కొద్ది తన తొలి సినిమా అందాల రాక్షసి మూవీలో లీడ్ హీరోయిన్ గా నటించింది లావణ్య త్రిపాఠి. మళ్లీ పదేళ్లకు లీడ్‌గా నడిపించే అవకాశం వచ్చింది. ఈ అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను అని లావణ్య త్రిపాఠి అంటుంది. నూతన దర్శకుడు రితేష్ రానా రూపొందిస్తున్న హ్యాపీ బర్త్ డే చిత్రం లావణ్య త్రిపాఠీ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో నరేష్ ఆగస్త్య, సత్య, వెన్నెల కిషొర్, గెటప్ శ్రీను తదితరులు ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి నిర్మిస్తుంది.
నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో మైత్రీ మూవీస్ సీఈవో చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 8న ప్రపంచవ్యాప్తంగా హ్యాపీ బర్త్ డే సినిమా విడుదల కాబోతున్నది. ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లు, రివీల్ చేసిన ప్రతీ క్యారెక్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. రాజమౌళి చేతుల మీదుగా విడుదలైన ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈసినిమా హిట్ కొట్టేందుకు లావణ్య చాలా కృషి చేస్తుంది. ప్రమోషన్ కార్యక్రమాలలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలో స్టైలిష్ డ్రెస్సులలో మెరుస్తుంది. తాజాగా లావణ్య త్రిపాఠి నాజూకైప నడుము అందాలు చూపిస్తూ మత్తెక్కిస్తుంది.
చురకత్తుల్లాంటి చూపులతో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేస్తుంది. లావణ్య త్రిపాఠి అందాల రచ్చకు అందరు షాక్ అవుతున్నారు. చూస్తుంటే ఈ అమ్మడు రానున్న రోజులలలో మరింత గ్లామరస్ షో చేయనున్నట్టు తెలుస్తుంది. తన పెళ్లిపై వచ్చిన వార్తలపై కూడా లావణ్య స్పందించింది. ఒక హీరోను నేను పెళ్లి చేసుకొన్నాననే వార్తలు నిజం కాదు. నాకు పెళ్లి జరుగలేదు. ఇప్పట్లో పెళ్లి చేసుకోను. నేను నా సినిమాల షూటింగ్ బిజీలతో ఉన్నాను. నాపై చాలా ఒత్తిడి ఉంది. నేను ఆ ఒత్తిడి తొలగించుకొనేందుకు నేను పర్వతారోహణ, ఔటింగ్, వెకేషన్స్‌కు వెళ్తుంటాను. పెళ్లి చేసుకొనే సమయం ఇచ్చినప్పుడు తప్పకుండా చేసుకోవాల్సిందే అని లావణ్య త్రిపాఠి తెలిపారు.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.