Home » News » Brahmamudi March 3rd 2026 Today Tuesday Episode Highlights
News

Brahmamudi March 3rd 2026 Episode: హద్దులు దాటిన రేఖ రాక్షసత్వం.. వాతలు భరించలేక ఇల్లు వదిలిపోయిన నందూ.. దత్త ఎంట్రీ!

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: March 3, 2026, 9:05 am
Advertisement

Brahmamudi March 3rd 2026 Episode : స్టార్ మాలో ప్రసారం అవుతున్న ‘బ్రహ్మముడి’ సీరియల్ ప్రేక్షకులను కట్టిపడేస్తూ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతోంది. కావ్య, రాజ్ మరణం తర్వాత సీరియల్‌లో అపర్ణ, ఆమె మనవరాళ్ల కష్టాలు చూస్తుంటే ప్రేక్షకుల కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. రేఖ రాక్షసత్వం రోజురోజుకూ శృతి మించుతోంది. నేటి (మార్చి 3) ఎపిసోడ్‌లో రేఖ పెట్టిన టార్చర్‌కు చిన్నారి నందూ ఇల్లు వదిలి వెళ్లిపోవడం, కానిస్టేబుల్ దత్త ఎంట్రీ ఇవ్వడం, అలాగే సీరియల్ కథ కొన్నేళ్లు ముందుకు సాగడం వంటి ఎన్నో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందో వివరంగా చూద్దాం.

Advertisement

Brahmamudi March 3rd 2026 Episode: హద్దులు దాటిన రేఖ రాక్షసత్వం.. వాతలు భరించలేక ఇల్లు వదిలిపోయిన నందూ.. దత్త ఎంట్రీ!

Brahmamudi March 3rd 2026 Episode పస్తులుంటున్న అపర్ణ.. కంటతడి పెట్టిస్తున్న చిన్నారులు

రేఖ పెళ్లి చేసుకుని కొత్త ఫ్యామిలీతో అపర్ణ ఇంట్లోకి రావడంతో అపర్ణ, ఆమె పిల్లల పరిస్థితి దారుణంగా మారుతుంది. రేఖ వదిన భ్రమరాంబ అపర్ణ పిల్లలకు కనీసం కడుపునిండా అన్నం కూడా పెట్టదు. ఆస్తి ఎవరి పేరు మీదా లేదని, వచ్చే కొద్దిపాటి అద్దె డబ్బులతో ఇల్లు గడుపుతున్నామని, కాబట్టి ఇంట్లో ఏం వండాలో, ఎవరు తినాలో తానే డిసైడ్ చేస్తానని వార్నింగ్ ఇస్తుంది భ్రమరాంబ. అపర్ణ చేసేది ఏమీ లేక ఉన్న కొద్దిపాటి అన్నాన్ని మనవరాళ్లు ఇందూ, నందూలకు పెట్టి తను పస్తులుంటుంది. తాను తినేశానని అబద్ధం చెబుతుంది అపర్ణ. అయితే, ఆ చిన్నారి ఇందూ మాత్రం నానమ్మ అబద్ధం చెబుతోందని గ్రహించి, తన చేతులతో అపర్ణకు అన్నం తినిపిస్తుంది. “నువ్వు అచ్చం మీ అమ్మ కావ్య లాగే తల్లివి” అని అపర్ణ ఆ చిన్నారిని చూసి కంటతడి పెట్టుకుంటుంది.

Advertisement

Brahmamudi March 3rd 2026 Episode బొమ్మల కోసం గొడవ.. పనివాళ్లతో పోల్చిన భ్రమరాంబ

ఇందూ, నందూలు ఆడుకుంటుండగా, భ్రమరాంబ కూతురు స్వాతి వచ్చి తన బొమ్మలు వాళ్లకి ఇస్తుంది. కానీ ఇంతలో ఐశ్వర్య వచ్చి ఆ బొమ్మలు లాక్కుంటుంది. “మీరు ఈ ఇంట్లో పనివాళ్లు, నేనే ఈ కోటకు మహారాణిని” అంటూ అవమానిస్తుంది. మనమంతా ఒక్కటే కదా అని ఇందూ అనగా, “మీ ముఖాలు, బట్టలు చూసుకోండి” అని చీదరించుకుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన భ్రమరాంబ నందూను కిందకు తోసేసి, “మీరెంత, మీ బతుకులెంత? మా పిల్లలతో ఆడుకుంటే తోలు వలిచేస్తా” అని బెదిరిస్తుంది. పిల్లల మనసుల్లో విషం నింపుతున్నావా అని అపర్ణ మండిపడగా.. రేఖ ఎంట్రీ ఇస్తుంది. “మా పిల్లలు అనుభవించడానికి పుట్టారు, నీ మనవరాళ్లు వాళ్లకు సేవలు చేయడానికి పుట్టారు. పరిమితుల్లో ఉండటం నేర్పించు” అని రేఖ అహంకారంతో అపర్ణకు వార్నింగ్ ఇస్తుంది.

తమ్ముడి ప్రాణాలు కాపాడిన రాజు

మరోవైపు స్వరాజ్ (రాజు) తన తమ్ముడితో ఆడుకుంటుంటాడు. బంతి కోసం తమ్ముడు రోడ్డుపైకి పరిగెత్తగా, వేగంగా వస్తున్న కారు అతన్ని ఢీకొట్టబోతుంది. వెంటనే రాజు ప్రాణాలకు తెగించి తమ్ముడిని పక్కకు లాగేసి కారు ప్రమాదం నుంచి కాపాడతాడు. ఈ క్రమంలో రాజుకు తీవ్ర గాయాలవుతాయి. “నాకు ఏమైనా పర్వాలేదు, నా తమ్ముడికి ఏమీ కాకూడదు” అని రాజు అనడంతో, వాళ్ల అమ్మ లక్ష్మి “వీడు నిజంగానే నా పెద్ద కొడుకు” అని గర్వంగా మురిసిపోతుంది. భవిష్యత్తులో అద్భుతాలు చేసి పెద్దవాడిని అవుతానని రాజు తన తండ్రికి మాటిస్తాడు.

Advertisement

నందూకు వాతలు పెట్టిన రేఖ.. ఇల్లు వదిలిన చిన్నారి!

ఇంట్లో ఓ పెద్ద బిజినెస్ మ్యాన్ వస్తున్నాడని రేఖ స్పెషల్‌గా చికెన్ వండిస్తుంది. ఆకలితో ఉన్న చిన్నారి నందూ డైనింగ్ టేబుల్ మీదున్న చికెన్ ముక్కను తీసుకుని తినబోతుంది. అది చూసిన రేఖ రాక్షసిలా రెచ్చిపోతుంది. “ఈ ఫుడ్ మాకు మాత్రమే అని చెప్పాను కదా” అంటూ వేడిగా ఉన్న అట్లకాడను తీసుకువచ్చి నందూ చేతిపై వాతలు పెడుతుంది. నందూ ఏడుపు విని పరుగెత్తుకు వచ్చిన అపర్ణ.. “చిన్న పిల్ల పట్ల జాలి లేదా?” అని కన్నీరుమున్నీరు అవుతుంది. రాత్రి అందరూ నిద్రపోయాక నందూ ఒక నిర్ణయానికి వస్తుంది. “నేను ఇక్కడ ఉండలేను అక్కా.. బాగా చదువుకుని పోలీస్ అయ్యాక వచ్చి రేఖ ఆంటీని బాగా కొడతాను. అప్పుడు నిన్ను, నానమ్మను తీసుకెళ్లిపోతాను” అని ఇందూకు ముద్దుపెట్టి అర్ధరాత్రి ఇల్లు వదిలి వెళ్లిపోతుంది నందూ.

నందూకు ఆశ్రయం ఇచ్చిన కానిస్టేబుల్ దత్త

ఉదయం లేచి చూసేసరికి నందూ కనిపించకపోవడంతో అపర్ణ గుండెలు బాదుకుంటుంది. పోలీసులకు కంప్లైంట్ చేద్దామంటే, “నేను పెట్టిన వాతలకే పారిపోయి ఉంటుందిలే, అదే వస్తుంది” అని రేఖ నిర్లక్ష్యంగా మాట్లాడుతుంది. ఇందూ చెల్లి కోసం ఏడుస్తుంటే, స్వాతి వచ్చి పాయసం ఇచ్చి ఓదారుస్తుంది.

మరోవైపు ఆకలితో అలమటిస్తున్న నందూ.. ఒక ఆవిడ సంచిలో ఉన్న బ్రెడ్ దొంగతనం చేస్తూ దొరికిపోతుంది. ఆవిడ నందూను కొట్టబోతుండగా, అప్పుడే మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి వచ్చి ఆవిడను బెదిరించి పంపిస్తాడు. “నేను హెడ్ కానిస్టేబుల్ వీ.ఎన్ దత్త.. ఏదో ఆకలికి తీసుకుందిలే” అని చెప్పి, ఆ బ్రెడ్ నందూకే తినిపిస్తాడు. మీ వాళ్ల దగ్గరకు వెళ్లిపో అని దత్త చెప్పినా నందూ వినకుండా అతని వెంటే వెళ్తుంది. తన ఇంటి ముందు పడుకున్న నందూను చూసి.. “నువ్వు ఎవరివి? మీ అమ్మానాన్న ఎవరు?” అని దత్త అడుగుతాడు. “వాళ్లు చచ్చిపోయారు, నేను ఇంటికి వెళ్లను. బాగా చదువుకుని పోలీస్ అయి ఆ రేఖ ఆంటీ బాక్సు బద్దలు కొట్టాలి.. పోలీస్ అవ్వాలంటే ఏం చేయాలో చెప్పు” అని నందూ ధైర్యంగా అడుగుతుంది. ఆ పాప పట్టుదల చూసి దత్త ఆశ్చర్యపోయి తన దగ్గరే చేరదీస్తాడు.

పెద్దదైన ఇందూ.. రేఖకు షాక్!

కథ కొన్నేళ్లు ముందుకు సాగుతుంది. ఉదయాన్నే ఇందూ పెరిగి పెద్దదై అచ్చం కావ్యలాగే ఇంటి పనులు చేస్తూ కనిపిస్తుంది. ముగ్గు వేస్తూ, ఇల్లు తుడుస్తున్న సమయంలో పొరపాటున ఇందూ చేతిలోంచి రుద్రాణి ఫోటో కింద పడి పగిలిపోతుంది. అది చూసి రేఖ కోపంతో ఊగిపోతూ ఇందూను కొట్టడానికి వస్తుంది. అప్పుడు అపర్ణ అడ్డుకుని రేఖకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది.

Advertisement

మరి పెరిగి పెద్దదైన ఇందూ రేఖ ఆటలు ఎలా కట్టించబోతోంది? పోలీస్ అవ్వాలన్న నందూ కల నెరవేరుతుందా? వీళ్లందరూ మళ్లీ ఎలా కలుసుకుంటారు? అనేది రాబోయే ఎపిసోడ్స్‌లో చాలా ఆసక్తికరంగా మారనుంది. బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి!

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి