Lavanya Tripathi : లావణ్య త్రిపాఠిని చీప్ యాక్టర్ అన్న నెటిజన్.. చెంప చెళ్లుమనేలా సమాధానం ఇచ్చిన హీరోయిన్
Lavanya Tripathi : క్రైస్తవ మిషనరీలో చదివే లావణ్య అమ్మాయి.. అక్కడి వేధింపులను భరించలేక ప్రాణాలు తీసుకుంది. బలవంతంగా మతాన్ని మార్పించాలని చూస్తున్నారంటూ వాపోయింది. చివరకు ఉరి వేసుకుని తన ప్రాణాలను తీసుకుంది లావణ్య. ఈ ఘటన దేశ వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఈ ఘటనపై ఇప్పటికీ రచ్చ నడుస్తూనే ఉంది. అయితే ఈ సెగ హీరోయిన్ లావణ్య త్రిపాఠికి తగిలింది. ఆమెని చీప్ యాక్టర్ అనడంతో నెటిజన్‌కి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చింది.తమిళనాడులో క్రైస్తవ మతం స్వీకరించనందుకు కొందరు లావణ్య అనే మైనర్ బాలికను వేధింపులకు గురి చేశారు. సదరు బాలిక ఆత్మహత్య చేసుకుంది.
మైనర్ బాలికకు న్యాయం జరగాలంటూ వాదిస్తున్న క్రమంలో సోషల్ మీడియాలో లావణ్య పేరుతో హ్యాష్ ట్యాగులను క్రియేట్ చేసి పోస్టులు చేశారు. అందులో కొందరు తెలిసో తెలియకనో లావణ్య త్రిపాఠి హ్యాష్ ట్యాగును కూడా షేర్ చేశారు.హీరోయిన్ లావణ్య త్రిపాఠి హ్యాష్ ట్యాగును షేర్ చేయడం వెనుక ఓ నెటిజన్ రియాక్ట్ అవుతూ చనిపోయిన మైనర్ బాలిక ధర్మం కోసం చనిపోతే, ఆమెను చౌక బారు నటితో ఎందుకు పోలుస్తున్నారు అంటూ కామెంట్స్ చేశాడు.ఈ ట్వీట్‌పై హీరోయిన్ లావణ్య త్రిపాఠి గట్టిగానే రియాక్ట్ అయ్యింది. ‘‘ఏదైనా చెడు ఘటన జరిగినప్పుడు మాత్రమే నీలాంటి వాళ్లు మహిళలను గౌరవిస్తారు.

lavanya tripathi counter attack to netizen
Lavanya Tripathi : లావణ్యకి కోపం వచ్చేసింది..!
అంతకు ముందు నీలాంటి వాళ్లే మహిళలను చౌక బారు అంటారు. అందరినీ గౌరవించడం నేర్చుకో. ఇది చాలా బాధాకరమైన ఘటన. కానీ సమాజంలో వాస్తవ పరిస్థితి ఇదే’’ అంటూ లావణ్య త్రిపాఠి సదరు నెటిజన్‌కు స్ట్రాంగ్‌గా రిప్లయ్ ఇచ్చారు. ఈ అమ్మడు ప్రస్తుతం సక్సెస్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఆ మధ్య వరుణ్ తేజ్‌ని వివాహం చేసుకోనుందని, ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందనే ప్రచారం సాగిన విషయం తెలిసిందే.