Varun Tej : మెగాఫ్యామిలీ ఇంట మరో శుభవార్త.. తండ్రికాబోతున్న వరుణ్ తేజ్ ..?
ప్రధానాంశాలు:
Varun Tej : మెగాఫ్యామిలీ ఇంట మరో శుభవార్త.. తండ్రికాబోతున్న వరుణ్ తేజ్ ..?
Varun Tej : మెగా కుటుంబంలో మరోసందడి మొదలుకాబోతుంది. మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ తండ్రి కాబోతున్నాడని తెలుస్తోంది. 2023లో లావణ్య త్రిపాఠి ని ప్రేమించి పెళ్లి చేసుకున్న వరుణ్, త్వరలోనే తమ తొలి సంతానానికి జన్మనివ్వనుందని సమాచారం. ఈ వార్తతో మెగా ఫ్యామిలీలో ఉత్సాహం నెలకొంది. ఇప్పటికే నాగబాబు కుమార్తె నిహారిక నిర్మాతగా విజయవంతంగా అడుగుపెట్టి, ‘కమిటీ కుర్రాళ్లు’ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది. మరోవైపు నాగబాబు కూడా రాజకీయంగా MLC పదవిని చేపట్టడం, త్వరలోనే మంత్రి పదవికి సిద్ధమవుతుండడం వంటి శుభపరిణామాలు వారి కుటుంబానికి ఆనందాన్ని కలిగిస్తున్నాయి.

Varun Tej : మెగాఫ్యామిలీ ఇంట మరో శుభవార్త.. తండ్రికాబోతున్న వరుణ్ తేజ్ ..?
Varun Tej తండ్రికాబోతున్న వరుణ్ తేజ్ ..?
లావణ్య త్రిపాఠి నటిగా మంచి కెరీర్ సాగిస్తున్న సమయంలో కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చిన తీరు ప్రశంసనీయం. ఇప్పుడు తల్లిగా మారబోతున్న సందర్భంలో ఆమె జీవితంలో ఇది మరో మెయిలు రాయిగా నిలవనుంది. ఈ రోజుల్లో విలువలతో, కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చే నటీమణులు తక్కువగానే ఉంటారు. అలాంటి భార్యను పొందిన వరుణ్ తేజ్ నిజంగా అదృష్టవంతుడని చెప్పాలి.
వ్యక్తిగత జీవితంలో వరుణ్ తేజ్ శుభవార్తలతో ముందుకు సాగుతున్నప్పటికీ, వృత్తి పరంగా మాత్రం ఇప్పటివరకు నిరాశపరిచే ఫలితాలే ఎదురయ్యాయి. ‘F3’ తర్వాత చేసిన ‘గాండీవదారి అర్జున’, ‘ఆపరేషన్ వాలెంటైన్’, ‘మట్కా’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలాయి. గతంలో ‘గద్దలకొండ గణేష్’ వంటి హిట్ ఇచ్చిన వరుణ్, ఆ తర్వాత వరుస పరాజయాలను ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం ఆయన రెండు కొత్త సినిమాల్లో నటిస్తున్నాడు.