Lavanya Tripathi : పెళ్లెప్పుడు అంటూ లావ‌ణ్య త్రిపాఠిని వేధించిన నెటిజ‌న్స్.. ఏమ‌ని చెప్పిందో తెలిస్తే నోరెళ్ల‌పెట్టడం ఖాయం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Lavanya Tripathi : పెళ్లెప్పుడు అంటూ లావ‌ణ్య త్రిపాఠిని వేధించిన నెటిజ‌న్స్.. ఏమ‌ని చెప్పిందో తెలిస్తే నోరెళ్ల‌పెట్టడం ఖాయం..!

 Authored By sandeep | The Telugu News | Updated on :3 February 2022,10:00 am

Lavanya Tripathi : అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ రంగప్రవేశం చేసిన లావణ్య త్రిపాఠి దూసుకెళ్తా అనే సినిమా కూడా చేయగా ఆ పాత్ర ఆమెకు పెద్దగా పేరు తెచ్చి పెట్టలేక పోయింది. ఆ తర్వాత ఏడాది బ్రహ్మ అనే సినిమా ద్వారా తమిళ సినిమా రంగంలో కూడా ఎంట్రీ ఇచ్చింది. అది కూడా ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. ఆ తర్వాత అక్కినేని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన మనం సినిమాలో చిన్న పాత్రలో కనిపించినా ఆ సినిమా కూడా ఆమెకు వర్కౌట్ కాలేదు. భలే భ‌లే మగాడివోయ్ సినిమాతో లావ‌ణ్య ద‌శ తిరిగింది. ఈ అమ్మ‌డు అక్క‌డ నుండి వైవిధ్యమైన పాత్ర‌లు చేస్తూ వ‌స్తుంది.ఒక‌వైపు సినిమాలతో బిజీగా ఉంటున్న లావ‌ణ్య త్రిపాఠి అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియాలోను ర‌చ్చ చేస్తుంటుంది. ఈ అమ్మ‌డు ట్రోల‌ర్స్‌కి కూడా గ‌ట్టిగానే స‌మాధానం ఇస్తుంటుంది.

తమిళనాడులో లావ‌ణ్య ఆత్మ‌హ‌త్య ఘటనపై సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పలువురు నెటిజన్లు. ఈ క్రమంలో కొందరు లావణ్యకు బదులుగా హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి అనే హ్యాష్‌ట్యాగ్‌ వాడుతున్నారు. దీంతో ఓ నెటిజన్ .. ‘లావణ్య త్రిపాఠి అనే హ్యాష్‌ట్యాగ్‌ వాడకండి. లావణ్య తమిళనాడుకు చెందిన సాధారణ దళిత అమ్మాయి. లావణ్య త్రిపాఠి ఒక చౌకబారు నటి. ధర్మం కోసం జీవితాన్నే త్యాగం చేసిన ఆమెను ఆ హీరోయిన్‌తో పోల్చకండి’ అని దురుసుగా మాట్లాడాడు.దీనిపై లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించింది. ‘నీలాంటి వాళ్లు అమ్మాయిల గురించి చీప్‌గా మాట్లాడతారు. కానీ ఏదైనా చెడు జరిగితే మాత్రం వెంటనే ఎక్కడలేని గౌరవాన్ని చూపిస్తారు.

lavanya tripathi open up on her marriage

lavanya tripathi open up on her marriage

Lavanya Tripathi : పెళ్లిపై నోరు విప్పిన లావ‌ణ్య‌..

ముందు ప్రతి ఒక్కరినీ గౌరవించడం నేర్చుకో! ఇది చాలా బాధాకరమైన సంఘటన. కానీ సమాజంలోని వాస్తవ పరిస్థితి ఇదే!’ అని ట్వీట్‌ చేసి గట్టి కౌంటరిచ్చింది. ఇక తాజాగా నెటిజ‌న్స్ తో ముచ్చ‌టిస్తున్న క్ర‌మంలో లావణ్య పెళ్లి ప్ర‌స్తావ‌న రాగా, నిజానికి ఆమె ఈ వార్తలపై మాట్లాడడానికి అంతగా ఆసక్తి చూపలేదు. ఎందుకంటే లావణ్య ఆ ప్రశ్నలను దాటవేసి తన తదుపరి చిత్రం “హ్యాపీ బర్త్‌డే” గురించి టాపిక్ డైవర్ట్ చేసింది. అయితే అభిమానులు పెళ్లి గురించి పదేపదే అడగడంతో “కొంతమంది ఈ రూమర్స్ ఎలా పుట్టిస్తారో తెలియదు. నా పెళ్లి గురించి వాళ్ళకే ఎక్కువ తెలుస్తోంది” అంటూ ఎటకారంగా సమాధానం చెప్పడం గమనార్హం.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది