Laya : సెకండ్ ఇన్నింగ్స్‌లో చిరంజీవితో నటించాలని ఉంది.. లయ కామెంట్స్.. వీడియో!
ప్రధానాంశాలు:
Laya : సెకండ్ ఇన్నింగ్స్‌లో చిరంజీవితో నటించాలని ఉంది.. లయ కామెంట్స్.. వీడియో!
Laya : అందం.. అభినయంతో ఒకప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ లయ. స్వయంవరం సినిమాతో వెండితెరకు పరిచయమై.. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ భామ జగపతి బాబు.. రాజశేఖర్, అర్జున్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని మెప్పించింది.

Laya : సెకండ్ ఇన్నింగ్స్‌లో చిరంజీవితో నటించాలని ఉంది.. లయ కామెంట్స్.. వీడియో!
Laya ఇంట్రెస్టింగ్ కామెంట్..
అయితే వరుస అవకాశాలు అందుకుంటూ కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం భర్త.. కుటుంబంతో కలిసి అమెరికాలో ఉంటున్న లయ.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. నిత్యం ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోస్ మాత్రమే కాదు.. స్నేహితులతో కలిసి ఎవర్ గ్రీన్ సాంగ్స్ కు అదిరిపోయే స్టెప్పులేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.
అయితే లయ త్వరలో నితిన్ తమ్ముడు సినిమాతో ప్రేక్షకులని పలకరించనుంది. ఈ క్రమంలో తాను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది. కెరీర్ ఫుల్ ఫిల్ అవ్వాలి అంటే పెద్ద స్టార్ తో నటించాలి. ఆ ఛాన్స్ నాకు రాలేదు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో చిరంజీవిగారితో నటించాలని ఉంది. అది ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి అని కామెంట్ చేసింది లయ .
సెకండ్ ఇన్నింగ్స్‌లో అయినా.. #Chiranjeevi గారితో నటించాలని ఉంది!#Laya Full Interview: [https://t.co/Iph1FcwI1z] pic.twitter.com/EiTRrEJ9IO
— Filmy Focus (@FilmyFocus) June 22, 2025