Ram Charan : రామ్ చరణ్ కు సాలీడ్ హిట్టివ్వడానికి పక్కా స్క్రిప్ట్‌తో ఉన్న కమల్ డైరెక్టర్..!

Authored By vamana sai | The Telugu News | Published on: June 14, 2022, 12:00 pm

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. ఆయన చేయబోతున్న సినిమాలన్నీ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లోనే ఉండబోతున్నాయి. అంతేకాదు, దర్శకులు కూడా ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో స్టార్ డమ్ ఉన్నవాళ్ళే లైన్‌లోకి వస్తున్నారు. ఇప్పటికే, శంకర్ దర్శకత్వంలో చరణ్ తన 15వ సినిమాను చేస్తున్నాడు. దీని తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కూడా ఓ సినిమాను చేయబోతున్నాడు. అలాగే, మరికొంత మంది లైన్‌లో ఉండగా చరణ్ తమిళ క్రేజీ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇచ్చినట్టు తాజాగా సమాచారం.లోకేష్ కనగరాజ్…ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ దర్శకుడి పేరే మార్మోగిపోతుంది.

ఇప్పటి వరకూ ఆయన కొలీవుడ్ లో చేసిన సినిమాలు నాలుగు. వాటిలో మొదటి సినిమా ‘మానగరం’ ఒకే అనిపిస్తే కార్తీ ఖైదీ, విజయ్ మాస్టర్ సినిమాలు మాత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇక ఈ వారం రిలీజైన కమల్ హాసన్ విక్రమ్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో అలరించడమే కాదు, భారీ మల్టీస్టారర్ ను లోకేష్ కమగ్ రాజ్ ఢీల్ చేసిన విధానం ఫిలిం మేకర్స్ ని కూడా ఆశ్చర్యపరిచింది. దాంతో లోకేష్ కనగరాజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.విక్రమ్ సినిమాతో భారీ హిట్ కొట్టిన లోకేష్ ఈ ప్రాజెక్ట్ కి సీక్వెల్ ఉంటుందని కూడా వెంటనే క్లారిటీ ఇచ్చాడు. విక్రమ్ సినిమా క్లయిమాక్స్ లో రోలెక్స్ క్యారెక్టర్ తోనే సీక్వెల్ పార్ట్ సాగనుంది.

lokesh kanagraj ready for gave hit to ram charan

lokesh kanagraj ready for gave hit to ram charan

Ram Charan: ఇంకా ఎంత మందిని యాడ్ చేస్తాడో..?

రీసెంట్ గా కమల్ కూడా విక్రమ్2 ఉంటుందని, అందులో రోలెక్స్ క్యారెక్టర్ చేసిన సూర్య ఈసారి ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపిస్తాడని అనౌన్స్ చేశాడు. ఖైదీ తర్వాత మాస్టర్ ఛాన్స్ ఇచ్చిన ఇళయదళపతి విజయ్ తో తన కొత్త ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకి తీసుకురాబోతున్నాడు లోకేష్. విజయ్ 67వ మూవీ తెరకెక్కనుంది.ఈ ప్రాజెక్ట్ లో విజయ్ గ్యాంగ్ స్టార్ గా కానిపిస్తాడు. అయితే, లోకేష్, విజయ్ కాంబినేషన్ లో వచ్చే సినిమా కూడా విక్రమ్ మూవీకి లింక్ ఉంటుందిట. ఆ తర్వాత తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కూడా ప్రాజెక్ట్ ఉండబోతుంది. ఈ సినిమాని కూడా లోకేష్ విక్రమ్ సినిమాకి లింక్ ఉండేలానే ప్లాన్ చేస్తున్నాడట. మొత్తానికి లోకేష్ కానగరాజ్ యూనివర్స్ లో ఇంకా ఎంత మందిని యాడ్ చేస్తాడో అని ఇప్పుడు అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్‌లో మాట్లాడుకుంటున్నారు.

vamana sai

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp