Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ 5 తెలుగు హౌజ్‌లో అప్పుడే మొదలైన లవ్ ట్రాక్.. ఎవరెవరు లవ్‌లో పడుతున్నారో తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ 5 తెలుగు హౌజ్‌లో అప్పుడే మొదలైన లవ్ ట్రాక్.. ఎవరెవరు లవ్‌లో పడుతున్నారో తెలుసా..?

 Authored By govind | The Telugu News | Updated on :9 September 2021,7:00 am

Bigg Boss 5 Telugu: ప్రపంచంలోనే అతిపెద్ద బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఇటీవలే మొదలైన సంగతి తెలిసందే. గత సీజన్స్ కంటే పూర్తి భిన్నంగా 5 రెట్ల ఎంటర్‌టైన్మెంట్ తో గ్రాండ్ గా మొదలైంది. ఈ సీజన్ కి కూడా కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా, ఈసారి హౌజ్‌లోకి 19మంది కంటెస్టెంట్స్ వచ్చారు. అయితే ప్రతీ సీజన్‌లో ఏదో ఒక జంట మధ్య లవ్ మొదలై వారి మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడుతుంది. ఇది షోలో భాగమే అనుకున్నా కూడా బయటకి వచ్చాక కూడా కొంతమంది కంటిన్యూ అవుతూ వస్తున్నారు.

love track started in bigg boss 5 telugu

love track started in bigg-boss-5-telugu

కానీ అది పూర్తిగా నిజం అని నమ్మడానికి లేకుండా పోతోంది. ఏదైమైనా హౌజ్‌లో నడిచే ప్రేమాయణాలు జనాలను బాగానే ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. రెండో సీజన్‌లో సామ్రాట్, తేజస్వి..మూడో సీజన్ పునర్నవి భూపాలం, రాహుల్ సిప్లిగంజ్..నాలుగో సీజన్‌లో అఖిల్, మోనాల్ గజ్జర్ ల మధ్య లవ్ ట్రాక్ నడిచింది. ఈ జంటకి బయట కూడా మంచి క్రేజ్ వచ్చిందని చెప్పక తప్పదు. ఇక హౌజ్‌లో పార్టిసిపెంట్స్ మధ్య వచ్చే తగాదాలు, చిరాకులు, పరాకులు కూడా షో మీద ఆసక్తికి కలిగిస్తున్నాయి.
ఇదే క్రమంలో ఇప్పుడు కొనసాగుతున్న బిగ్ బాస్ సీజన్ 5లోనూ లవ్ ట్రాక్ మొదలైంది. ఈ సారి ఇంట్లోకి వచ్చిన కంటెస్టెంట్స్ లో చాలా మందికి పెళ్లిళ్లు అయిపోయాయి.

Bigg Boss 5 Telugu: ఇన్‌డైరెక్ట్‌గా తనమీద క్రష్ ఉన్నట్టుగా చెబుతోంది.

షణ్ముఖ్, మోడల్ జస్వంత్, మానస్ లాంటి వారు మాత్రమే పెళ్లి కాని వారు. అమ్మాయిలలో కూడా చాలా మంది ఉన్నారు. వీరిలో ప్రస్తుతానికి మాత్రం ఒకరు తన ఇష్టాన్ని బయటపెట్టారు. ఆమె ప్రియాంక సింగ్. జబర్దస్త్ నుంచి వచ్చిన ప్రియాంక, ముందు అబ్బాయి. ఆ తర్వాత అమ్మాయిగా మారిపోయింది. బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చిన తర్వాత తన కష్టాలను అందరితోనూ చెప్పుకుంటోంది. హౌజ్‌లో వారిని అన్నయ్యా అని పిలుస్తూ పలకరిస్తుంది. యాంకర్ రవి, విశ్వ, శ్రీరామచంద్ర సహా మిగిలిన వారినీ అన్నయ్యా అనే పిలుస్తున్న ప్రియాంక..మానస్ ని మాత్రం అన్నయ్యా అని పిలవడం లేదు. అంతేకాదు ఇన్‌డైరెక్ట్‌గా తనమీద క్రష్ ఉన్నట్టుగా చెబుతోంది. చూడాలి మరి రానున్న రోజుల్లో ఎవరికి ఎవరి మీద ప్రేమ పుడుతుందో.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది