Priyanka Arul Mohan | ఏఐతో హీరోయిన్‌ని దారుణంగా చూపిస్తున్న నెటిజన్స్.. ఫైర్ అయిన ఓజీ భామ
Priyanka Arul Mohan | ‘ఓజీ’ చిత్రంలో పవన్ కళ్యాణ్ భార్యగా కన్మణి అనే పాత్రలో ఆకట్టుకుంది ప్రియాంక మోహన్ . ఆ చిత్రం బ్లాక్‌బస్టర్ కావడంతో తెలుగులో ఆమెకు మరిన్ని అవకాశాలు తలుపు తడుతున్నాయి. అయితే ప్రియాంక మోహన్‌కి ఊహించని షాక్ తగిలింది. బయట, సినిమాల్లోనూ ఆమె ఎంత పద్ధతిగా ఉంటుందో అందరికీ తెలిసిందే. అలాంటిది సోషల్‌మీడియాలో ఆమె మొహంతో కొన్ని ఫేక్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
#image_title
పైశాచికం..
అందులో ప్రియాంక అసభ్యంగా, ఓవర్ ఎక్స్‌పోజింగ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు ప్రియాంక ఇలా మారిపోయిందేంటి అనుకుంటూ వాటిని తెగ షేర్ చేస్తున్నారు. ఈ విషయం ప్రియాంక దృష్టికి వెళ్లడంతో ఆమె ఘాటుగా స్పందిస్తూ ట్వీట్ చేసింది. ‘ఏఐ ద్వారా నన్ను తప్పుగా చూపిస్తూ క్రియేట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫేక్ ఫోటోల్ని షేర్ చేయడం దయచేసి ఆపండి.
ఏఐ టెక్నాలజీని క్రియేవిటీ కోసం వాడుకోవాలి తప్ప తప్పుడు సమాచారం సృష్టించడానికి కాదు. మనం ఏది క్రియేట్ చేస్తున్నాం, ఏది షేర్ చేస్తున్నాం అన్న దానిపట్ల జాగ్రత్త వహించాలి’ అని ప్రియాంక ఘాటుగా స్పందించింది. ఈ విషయంలో నెటిజన్లు ప్రియాంకకి మద్దతుగా నిలుస్తున్నారు. ఇలాంటి ఫేక్ ఫోటోలు క్రియేట్ చేసేవారిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తమ పైశాచిక ఆనందం కోసం ఎదుటివారిని చులకనగా చూపించేవారిని ఏం చేసినా తప్పులేదని కామెంట్లు చేస్తున్నారు.