Chandrabose : “RRR”లో నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు రావడం తెలిసిందే. దీంతో “RRR” భారతీయ చలనచిత్ర రంగం యొక్క స్థాయిని పెంచేసింది. ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా సత్తా చాటింది. ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో నాటు నాటు సాంగ్ కి అవార్డు లభించింది. ఆస్కార్ వేదికపై గేయ రచయిత చంద్రబోస్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అవార్డు అందుకున్నారు. అయితే ఈ అవార్డు అందుకోకముందు పాట రాసిన చంద్రబోస్ ఓ వెబ్ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. భారతదేశంలో ఎన్నో భాషలు ఉన్నాయి. అందులోనూ తెలుగు భాషలో ప్రపంచ స్థాయిలో నేను రాసిన పాట ఆస్కార్
అనే ప్రతిష్టాత్మక అవార్డుకి నామినేట్ కావటం నా అదృష్టంగా భావిస్తున్నాను. కృషి రాజమౌళి.. డాన్స్ వేసిన హీరోలు ఇంకా నృత్య దర్శకుడు ఉండి ఉండొచ్చు కానీ… పాట ఆస్కార్ దాకా వెళ్ళిందంటే దానికి ప్రధాన కారణం నాది కూడా ఉంది. దీన్ని గర్వంగా చెప్పుకోవడం లేదు నా అదృష్టంగా చెప్పుకుంటున్నాను అని అన్నారు. ఈ పాట రాయడానికి సంవత్సరం మీద 7 నెలలు పట్టింది. మొత్తం 19 నెలలలో నాటు నాటు సాంగ్ రాయటం జరిగింది. రాజమౌళి గారికి నచ్చేలా కీరవాణి గారు మెచ్చుకునేలా లక్ష్యంతో దృఢ సంకల్పంతో ఈ పాట రాయటం జరిగింది. కానీ రాజమౌళికి కాకుండా కీరవానికి కాకుండా..
మన రాష్ట్రం కాకుండా పక్క రాష్ట్ర మాత్రమే కాకుండా.. పక్క దేశం కాకుండా.. ఇతర ఖండాలలోకి కూడా వెళ్లి.. విజయకేతనం ఎగరవేస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. ఎర్ర జొన్న రొట్టెలోనే మిరప తొక్కు కలిపినట్టు అనే లిరిక్స్ ఎంతగానో నచ్చింది. అది మన ఆహార సంస్కృతిని అదే విధంగా వ్యవసాయ సంస్కృతిని.. ఆర్థిక స్థితిని, శరీర సౌష్టాన్ని, గ్రామీణ నేపథ్యాన్ని తెలిపే వాక్యమది. అయితే ఎన్టీఆర్ కూడా నామినేట్ అయినట్లు యాంకర్ ప్రశ్న వేయగా ఎన్టీఆర్ చరణ్ ఎవరు నామినేట్ కాలేదు. ఆస్కార్ కి “RRR” లో నాటు నాటు సాంగ్ మాత్రమే నామినేట్ అయ్యింది.. అని చంద్రబోస్ క్లారిటీ ఇచ్చారు.
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.