Chandrabose : ఆస్కార్ వచ్చింది ఎన్టీఆర్, చరణ్ లకి కాదు … చంద్రబోస్ వైరల్ కామెంట్స్ వీడియో వైరల్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chandrabose : ఆస్కార్ వచ్చింది ఎన్టీఆర్, చరణ్ లకి కాదు … చంద్రబోస్ వైరల్ కామెంట్స్ వీడియో వైరల్..!!

Chandrabose : “RRR”లో నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు రావడం తెలిసిందే. దీంతో “RRR” భారతీయ చలనచిత్ర రంగం యొక్క స్థాయిని పెంచేసింది. ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా సత్తా చాటింది. ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో నాటు నాటు సాంగ్ కి అవార్డు లభించింది. ఆస్కార్ వేదికపై గేయ రచయిత చంద్రబోస్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అవార్డు అందుకున్నారు. అయితే ఈ అవార్డు అందుకోకముందు పాట రాసిన చంద్రబోస్ ఓ వెబ్ మీడియా […]

 Authored By sekhar | The Telugu News | Updated on :14 March 2023,8:00 pm

Chandrabose : “RRR”లో నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు రావడం తెలిసిందే. దీంతో “RRR” భారతీయ చలనచిత్ర రంగం యొక్క స్థాయిని పెంచేసింది. ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా సత్తా చాటింది. ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో నాటు నాటు సాంగ్ కి అవార్డు లభించింది. ఆస్కార్ వేదికపై గేయ రచయిత చంద్రబోస్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అవార్డు అందుకున్నారు. అయితే ఈ అవార్డు అందుకోకముందు పాట రాసిన చంద్రబోస్ ఓ వెబ్ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. భారతదేశంలో ఎన్నో భాషలు ఉన్నాయి. అందులోనూ తెలుగు భాషలో ప్రపంచ స్థాయిలో నేను రాసిన పాట ఆస్కార్

Lyricist Chandrabose Comments on NTR and Ram charan about RRR Movie Winning Oscar

Lyricist Chandrabose Comments on NTR and Ram charan about RRR Movie Winning Oscar

అనే ప్రతిష్టాత్మక అవార్డుకి నామినేట్ కావటం నా అదృష్టంగా భావిస్తున్నాను. కృషి రాజమౌళి.. డాన్స్ వేసిన హీరోలు ఇంకా నృత్య దర్శకుడు ఉండి ఉండొచ్చు కానీ… పాట ఆస్కార్ దాకా వెళ్ళిందంటే దానికి ప్రధాన కారణం నాది కూడా ఉంది. దీన్ని గర్వంగా చెప్పుకోవడం లేదు నా అదృష్టంగా చెప్పుకుంటున్నాను అని అన్నారు. ఈ పాట రాయడానికి సంవత్సరం మీద 7 నెలలు పట్టింది. మొత్తం 19 నెలలలో నాటు నాటు సాంగ్ రాయటం జరిగింది. రాజమౌళి గారికి నచ్చేలా కీరవాణి గారు మెచ్చుకునేలా లక్ష్యంతో దృఢ సంకల్పంతో ఈ పాట రాయటం జరిగింది. కానీ రాజమౌళికి కాకుండా కీరవానికి కాకుండా..

Chandrabose gets appreciated by the SCL, Society of Composers and Lyricists  - Telangana Today

మన రాష్ట్రం కాకుండా పక్క రాష్ట్ర మాత్రమే కాకుండా.. పక్క దేశం కాకుండా.. ఇతర ఖండాలలోకి కూడా వెళ్లి.. విజయకేతనం ఎగరవేస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. ఎర్ర జొన్న రొట్టెలోనే మిరప తొక్కు కలిపినట్టు అనే లిరిక్స్ ఎంతగానో నచ్చింది. అది మన ఆహార సంస్కృతిని అదే విధంగా వ్యవసాయ సంస్కృతిని.. ఆర్థిక స్థితిని, శరీర సౌష్టాన్ని, గ్రామీణ నేపథ్యాన్ని తెలిపే వాక్యమది. అయితే ఎన్టీఆర్ కూడా నామినేట్ అయినట్లు యాంకర్ ప్రశ్న వేయగా ఎన్టీఆర్ చరణ్ ఎవరు నామినేట్ కాలేదు. ఆస్కార్ కి “RRR” లో నాటు నాటు సాంగ్ మాత్రమే నామినేట్ అయ్యింది.. అని చంద్రబోస్ క్లారిటీ ఇచ్చారు.

Tags :

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది