Home » Entertainment » Maa President Manchu Vishnus Sensational Comments Video Viral
Entertainment

Manchu Vishnu : “మా” అధ్యక్షుడు మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు వీడియో వైరల్…!!

Authored By
Breaking News
The Telugu News | Published on: May 19, 2023, 8:00 pm
Advertisement

manchu vishnu : “మా” అధ్యక్షుడు మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఓటీటీ రంగానికి మంచి ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. మరి కొన్ని సంవత్సరాలలో ఓటీటీ… సినిమా రంగంలో మొదటి ప్రాధాన్యత అయ్యే అవకాశం ఉందని కూడా తన అభిప్రాయాన్ని తెలియజేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యత్వం పొందుకోవాలంటే కచ్చితంగా 10 సినిమాలు నటించాలన్న నిబంధన పెట్టినట్లు విష్ణు తెలియజేశారు. 10 సినిమాలు నటించిన తర్వాత…”మా” సభ్యత్వం కార్డ్ ఇవ్వడం జరుగుతుందని మంచు విష్ణు పేర్కొన్నారు. అసోసియేషన్ మెంబర్ కి లైఫ్.. మెంబర్ కి తేడా లైఫ్ ఇన్సూరెన్స్… మినహా మిగతాదంతా ఉంటుందని స్పష్టం చేశారు.

Advertisement

తెలియని ముఖాలకు అసోసియేషన్ సభ్యత్వం ఇచ్చే ప్రసక్తి లేదని విష్ణు తెలియజేశారు. ఇదే సమయంలో “మా” భవనం త్వరలో కట్టబోతున్నట్లు స్పష్టం చేశారు. ఫిలింనగర్ లోనే కట్టడానికి గల కారణం అది అందరికీ దగ్గరగా ఉండే ప్రాంతమని పేర్కొన్నారు. గతంలో ఆరు నెలలు అని చెప్పగా ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అని చెప్పడానికి.. గల కారణం అందరితో మాట్లాడుకుని తీసుకున్న నిర్ణయం బట్టి… “మా” భవనం ఫిలింనగర్లో కట్టబోతున్నట్లు “మా” అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు స్పష్టం చేయడం జరిగింది.

maa-president-manchu-vishnus-sensational-comments-video-viral

Advertisement

ప్రకాష్ రాజ్ టీం రాజీనామా చేసిన గాని … వాళ్లతో సత్సంబంధాలు బాగానే ఉన్నాయని అన్నారు. వాళ్ల జన్మదినోత్సవాలకు శుభాకాంక్షలు చెబుతూనే రెండు అతి కీలకమైన విషయాలకు సంబంధించి ప్రకాష్ రాజ్ గారితో మాట్లాడటం జరిగిందని మంచు విష్ణు పేర్కొన్నారు.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి