Home » Entertainment » Mahesh Babu 28 Movie Trivikram Gets Clarity
Entertainment

Mahesh Babu : హ‌మ్మ‌య్య‌.. మహేష్ బాబు- త్రివిక్ర‌మ్ సినిమా షూటింగ్, రిలీజ్ డేట్ చెప్పిన మేక‌ర్స్

Authored By
Sam C
The Telugu News | Published on: July 9, 2022, 10:00 pm
Advertisement

Mahesh Babu : టాలీవుడ్ స్టార్ హీరోల‌లో మహేష్ బాబు ఒక‌రు. ఇటీవల సర్కారు వారి పాట సినిమాతో తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చిన మహేష్ బాబు ఆ సినిమాతో మంచి ఫలితాన్ని అందుకున్నారు. సర్కారు వారి పాట సినిమా సూపర్ గా ఉందని మహేష్ బాబు అభిమానులు అంటుంటే అంత సూపర్ గా ఏమీ లేదని సాధారణ ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు చేయబోతున్న సినిమా ఏమిటి అనే క్లారిటీ ఉంది కానీ ఆ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పుడు విడుదల చేస్తారనే విషయం మీద ఎలాంటి క్లారిటీ లేదు. త్రివిక్ర‌మ్‌తో చేస్తాడా, లేదంటే రాజ‌మౌళితో చేస్తాడా అనే సందేహాలు ఉండ‌గా, దానికి క్లారిటీ వ‌చ్చింది.

Advertisement

తాజాగా మేక‌ర్స్ ఈ సినిమా షూటింగ్‌పై క్లారిటీ ఇస్తూ గ్లింప్స్‌ను విడుద‌ల చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకుంటున్న ఈ చిత్రం ఆగ‌స్టులో షూటింగ్ ప్రారంభించ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అంతేకాకుండా వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో సినిమాను విడుద‌య చేయ‌బోతున్న‌ట్లు కూడా గ్లింప్స్‌లో వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఈ గ్లింప్స్ నెట్టింట వైరల్ అవుతుంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాస‌ని క్రియేష‌న్స్ ప‌తాకంపై చిన‌బాబు నిర్మిస్తున్నాడు. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. గ‌తంలో మ‌హేష్- త్రివిక్ర‌మ్ కాంబోలో తెర‌కెక్కిన ‘అత‌డు’, ‘ఖ‌లేజా’ క్లాసిక్ చిత్రాలుగా నిలిచాయి.

mahesh babu 28 movie Trivikram gets clarity

Advertisement

Mahesh Babu : ఫుల్ హ్యాపీస్..

ఈ రెండు చిత్రాలు క‌మ‌ర్షియ‌ల్‌గా అంత‌గా స‌క్సెస్ సాధించ‌కోపోయినా బుల్లితెర‌పై మాత్రం ఘ‌న విజ‌యం సాధించాయి. అయినప్పటికీ త్రివిక్రమ్ బాక్సాఫీస్ ట్రాక్ మీద నమ్మకంతో మహేష్ బాబు సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఈ కాంబినేషన్ పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.మహేష్ బాబుతో త్రివిక్రమ్ కొత్త సినిమాను గత ఏడాదిలోనే మొదలు పెట్టాలని అనుకున్నారు. కానీ అప్పటికి పూర్తి స్థాయిలో స్క్రిప్టు సిద్ధం కాకపోవడంతో మహేష్ బాబు ఒప్పుకోలేదు. మొత్తం పూర్తిస్థాయిలో స్క్రిప్టు సిద్ధం అయితే గాని సినిమా చేయడానికి మహేష్ నిర్ణయం తీసుకోలేక పోయాడు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి