Home » Entertainment » Mahesh Babu 29 29 Big Leak Star Actor As Villain
Entertainment

Mahesh Babu : మహేష్ 29 బిగ్ లీక్.. ఆయనే విలన్ రాసిపెట్టుకోవచ్చు..!

Authored By
Rame Samhith
The Telugu News | Published on: January 29, 2025, 8:00 pm
Advertisement

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబోలో రాబోతున్న SSMB 29 సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ లో కె.ఎల్ నారాయణ ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సినిమా దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తారని తెలుస్తుంది. ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో గ్లోబల్ త్రొట్టింగ్ కథతో ఈ సినిమా రాబోతుంది. ఐతే ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా ఒక కొత్త లీక్ వచ్చింది. సినిమాలో ఇప్పటివరకు మహేష్ తో ప్రియాంక చోప్రా హీరోయిన్ అని డిక్లేర్ అయ్యింది. రాజమౌళి ఇప్పటికే మహేష్ బాబు పాస్ పోర్ట్ కూడా లాక్ చేశాడు. ఐతే మహేష్ బాబు 29వ సినిమా లో విలన్ గా మళయాళ స్టార్ పృధ్విరాజ్ సుకుమారన్ డిస్కషన్ లో ఉన్నాడు.

Advertisement

Mahesh Babu : మహేష్ 29 బిగ్ లీక్.. ఆయనే విలన్ రాసిపెట్టుకోవచ్చు..!

Mahesh Babu : టాక్స్ పూర్తి కాలేదు..

కొద్దిరోజులుగా పృధ్విరాజ్ పై వస్తున్న వార్తలపై ఆయన స్పందించాడు. రాజమౌళి మహేష్ బాబు సినిమాలో నటించాలనే కాల్ వచ్చినట్టు చెప్పాడు. ఐతే అది ఇంకా డిస్కషన్ స్టేజ్ లోనే ఉంది. టాక్స్ పూర్తి కాలేదు అది పూర్తయ్యాకే తాను ఏమైనా చెప్పగలనని అన్నాడు పృధ్విరాజ్ సుకుమారన్. సో పృధ్వి రాజ్ ఇలా చెబుతున్నాడు అంటే కచ్చితంగా మహేష్ సినిమాలో అతను కన్ ఫర్మ్ అన్నట్టే లెక్క.

Advertisement

ఇక ఇదే క్రమంలో సలార్ 2 గురించి కూడా మాట్లాడాడు పృధ్విరాజ్. ప్రభస్ కు తన క్రేజ్ ఏంటో తనకు తెలియదని.. ఎంత పెద్ద స్టార్ అయినా చాలా సరదాగా ఉంటాడని అన్నారు పృధ్విరాజ్. తనతో క్లోజ్ గా ఉండే వారితోనే అన్ని పంచుకుంటాడని అన్నారు. సలార్ 2 కోసం తాను కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా అన్నారు పృధ్విరాజ్ సుకుమారన్. మహేష్ బాబు రాజమౌళి సినిమా చర్చల్లో ఉన్నా అనగానే పృధ్విరాజ్ ని జక్కన్న గట్టిగానే వాడుకునేందుకు ఫిక్స్ అయ్యడని ఆడియన్స్ భావిస్తున్నారు. ఇక మళయాళంలో పృధ్విరాజ్ డైరెక్షన్ లో కూడా అదరగొట్టేస్తున్నారు. Mahesh Babu, Mahesh 29, Pridhviraj Sukumaran, Rajamouli, Priyanka Chopra

Rame Samhith

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి