Mahesh Babu : ఆ సినిమా ఒక సంచలనం .. నా జీవితాన్ని మార్చేసింది.. ఇప్పుడు ‘వారణాసి’ తో అదే జరగబోతుంది : మహేశ్ బాబు

 Authored By suma | The Telugu News | Updated on :4 February 2026,11:00 am

ప్రధానాంశాలు:

  •  Mahesh Babu : ఆ సినిమా ఒక సంచలనం .. నా జీవితాన్ని మార్చేసింది.. ఇప్పుడు 'వారణాసి' తో అదే జరగబోతుంది : మహేశ్ బాబు

Mahesh Babu : టాలీవుడ్ Tollywood సూపర్ స్టార్ మహేశ్ బాబు Mahesh Babu కెరీర్‌ను పూర్తిగా మలుపుతిప్పిన చిత్రం ‘పోకిరి’ pokiri movie . విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ఈ సినిమా మహేశ్‌ను కేవలం స్టార్‌గా కాకుండా మాస్ ఆడియన్స్ హృదయాల్లో నిలిచిపోయే ఐకాన్‌గా మార్చింది. అప్పటి వరకు సాఫ్ట్ ఇమేజ్ ఉన్న మహేశ్ పోకిరి తర్వాత పవర్‌ఫుల్, స్టైలిష్, మాస్ అప్పీల్ ఉన్న హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆ సినిమా సాధించిన విజయం కేవలం వసూళ్లకే పరిమితం కాకుండా తెలుగు సినిమా స్థాయినే కొత్త దిశగా నడిపించింది. ‘పోకిరి’ తర్వాత మహేశ్ బాబు సినిమాలపై ప్రేక్షకుల అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

mahesh babu about on the varanasi movie

Mahesh Babu : ఆ సినిమా ఒక సంచలనం .. నా జీవితాన్ని మార్చేసింది.. ఇప్పుడు ‘వారణాసి’ తో అదే జరగబోతుంది : మహేశ్ బాబు

Mahesh Babu : విజయం తర్వాత బాధ్యత, అంచనాల మధ్య పోరాటం

ఇటీవల హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మహేశ్ బాబు Mahesh Babu తన కెరీర్ ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “పోకిరి నా జీవితంలో ప్రతిదీ మార్చేసింది” అని ఆయన స్పష్టం చేశారు. ఆ సినిమా తనను ఒక్క రాత్రిలో స్టార్‌గా మార్చడమే కాకుండా ప్రేక్షకుల అంచనాలను కూడా ఆకాశానికి చేర్చిందని చెప్పారు. ఆ విజయం ఇచ్చిన కిక్‌తో పాటు ఒక పెద్ద బాధ్యత తనపై పడిందని ఆ తర్వాత చేసే ప్రతి సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందా? వారి అంచనాలను అందుకుంటుందా? అనే టెన్షన్ ఎప్పుడూ వెంటాడేదని వెల్లడించారు. స్టార్‌డమ్ పెరిగే కొద్దీ నిర్ణయాలు మరింత జాగ్రత్తగా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని మహేశ్ చెప్పారు. పోకిరి తర్వాత తన ప్రతి అడుగు చాలా ఆలోచించి వేసినదేనని ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించింది.

Mahesh Babu : వారణాసి – మరోసారి అదే ఉత్కంఠ

చాలా కాలం తర్వాత మళ్లీ అలాంటి ఉత్కంఠను ఇప్పుడు ‘వారణాసి’  varanasi Movie సినిమా విషయంలో అనుభవిస్తున్నానని మహేశ్ బాబు Mahesh Babu  తెలిపారు. పోకిరి సమయంలో ఎలాంటి ఎగ్జైట్‌మెంట్ అయితే ఉందో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ విషయంలో కూడా అదే ఫీలింగ్ ఉంది అంటూ ఆయన అభిమానులను మరింత ఉత్సాహపరిచారు. ‘వారణాసి’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు అంతకుమించి ఏదో ప్రత్యేకమైన అనుభవంగా ఉండబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ప్రేక్షకుల అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో తనకు పూర్తిగా తెలుసని ఈ ప్రాజెక్ట్ వాటిని ఖచ్చితంగా మించిపోతుందని ఆయన నమ్మకంగా చెప్పారు. పోకిరి ఎలా అయితే తెలుగు సినిమాకు కొత్త గుర్తింపు తీసుకొచ్చిందో అదే విధంగా ‘వారణాసి’ కూడా ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కిస్తుందని ఫ్యాన్స్‌తో పాటు ట్రేడ్ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి. మహేశ్ బాబు కెరీర్‌లో మరోసారి చరిత్ర సృష్టించే సినిమా రాబోతోందన్న భావనతో అభిమానులు ఇప్పటి నుంచే భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు.

suma

Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి