Mahesh Babu : కూతురితో మ‌హేష్ బాబు రియాలిటీ షో.. అభిమానులు క‌ళ్ల‌న్ని ఆ షో పైనే..

Authored By Sam C | The Telugu News | Published on: August 29, 2022, 5:40 pm

Mahesh Babu : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరో. ఆయ‌న సినిమాల‌పై అభిమానుల‌లో ఎంత‌టి క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. హిట్​లు, ఫట్​లు అని ఆలోచించకుండా ప్రయోగాత్మక సినిమాలను ఎంకరేజ్​చేస్తుంటాడు. ఎలాంటి వివాదాలు లేకుండా తన పని తాను చూసుకుంటూ పోయే హీరోగా ముద్ర వేసుకున్నాడు. అలాగే సినిమాలతోపాటు ఫ్యామిలీ లైఫ్​ను కూడా బ్యాలెన్స్​గా మెయింటేన్​చేయడంలో మహేశ్​బాబు తనకు తనే సాటి. ఇక మహేశ్ బాబుకు తన గారాల పట్టి సితార, కొడుకు గౌతమ్​అంటే ఎంత ప్రేమో చెప్పనవసరం లేదు. క్ష‌ణం స‌మ‌యం దొరికిన వారితో స‌ర‌దాగా గ‌డిపేందుకు ప్ర‌య‌త్నిస్తుంటారు. అందుకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంటాయి.

Mahesh Babu : కూతురితో స‌ర‌దాగా..

అయితే ఇటీవ‌ల మ‌హేష్ బాబు ఎక్కువ‌గా రియాలిలటీ షోల‌లో తెగ సంద‌డి చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇటీవల నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్​గా వ్యవహరించిన అన్​స్టాపబుల్​షోలో మహేశ్​బాబు పాల్గొన్నాడు. ఆయన మాటలతో, పలు ఆసక్తికర విషయాలతో ఆద్యంత సందడిగా సాగింది ఆ ఎపిసోడ్​. తాజాగా మళ్లీ ఓ టీవీ షోలో తళుక్కున మెరిశారు మహేశ్​బాబు. జీ తెలుగులో ఇటీవలే ప్రారంభమైన హిందీ టెలివిజన్ డ్యాన్స్ రియాలిటీ షో డాన్స్ ఇండియా డ్యాన్స్ యొక్క రాబోయే ఎపిసోడ్‌లో సర్కారు వారి పాట నటుడు మ‌హేష్‌, అతని ముద్దుల కూతురు సితార ఘట్టమనేని కనిపించనున్నారనేది తాజా వార్త.

Mahesh Babu And Ghattamaneni Sithara Doing Reality Show

Mahesh Babu And Ghattamaneni Sithara Doing Reality Show

ఇప్పటికే వీరిద్దరి ఎపిసోడ్ షూటింగ్ పూర్తయింది. డాన్స్ ఇండియా డ్యాన్స్ తెలుగును అకుల్ బాలాజీ హోస్ట్ చేస్తున్నారు. ఈ షోకు ప్రముఖ కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్, నటీమణులు సంగీత, ఆనందిని న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ షోకి సంబంధించిన వీడియో ఒక‌టి బ‌య‌ట‌కు రాగా, ఇందులో మహేశ్​బాబు స్టైలిష్​అవుట్ ఫిట్​ధరించగా, సితారా కూడా గ్లిట్టర్​ఫ్రాక్​వేసుకుని ఆకట్టుకునేలా ఉంది. మరి మహేశ్ బాబు, సితార పాల్గొన్న ఈ షో ఎప్పుడు టెలికాస్ట్​అవుతుందో వేచి చూడాలి. కాగా మహేశ్​బాబు 28వ చిత్రం త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుండ‌గా, ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది అంటే 2023 ఏప్రిల్​28న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

Sam C

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp