mahesh babu and namrata love story interesting issues
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. చాలా సంవత్సరాల క్రితం వంశీ అనే సినిమా షూటింగ్స్ సందర్భంగా పరిచయమైన నమ్రత శిరోద్కర్తో ఆయన వివాహం జరిగింది. అప్పటికే ఆమె మిస్ ఇండియా అవ్వడంతో చాలా బాలీవుడ్ సినిమాల్లో నటించింది, బాలీవుడ్లో బిజీగా ఉన్న నమ్రత మహేష్ బాబు తో ప్రేమలో పడ్డ తర్వాత సినిమాలను పూర్తిగా వదిలి వేసింది. మహేష్ బాబు సినిమాలను వదలాల్సిందిగా నమ్రతకు చెప్పలేదు.. అయినా కూడా ఆమె కుటుంబ బాధ్యతలను తీసుకోవడం కోసం తాను సినిమా కెరియర్ని వదిలేసింది. సినిమాల్లో నటించేందుకు మహేష్ బాబు ఎప్పుడూ కూడా ఆమెకు అడ్డు చెప్పలేదు.
ప్రేమలో పడ్డ సమయంలో కూడా నమ్రత పలు తెలుగు మరియు హిందీ సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో నమ్రతను ఏ ఒక్కసారి కూడా మహేష్ బాబు ఇలా నటించాలి.. అలాంటి కాస్ట్యూమ్స్ వేసుకోవాలి అంటూ కండిషన్స్ పెట్ట లేదట. పైగా తన ప్రత్యర్థులైన హీరోలతో నటించిన కూడా ఏ మాత్రం అడ్డు చెప్పలేదు అంటూ సమాచారం అందుతుంది, మహేష్ బాబు మరియు నమ్రత శిరోద్కర్ల మధ్య ఉన్న ప్రేమకు మరో ప్రత్యక్ష సాక్ష్యం ఏంటి అంటే ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్న విషయము దాదాపు రెండు సంవత్సరాల పాటు ఏ ఒక్కరికి తెలియదు. ఈ మధ్య కాలంలో ప్రేమ అంటే వెంటనే పబ్బుల్లో లేదా క్లబ్బుల్లో కనిపించడం పరిపాటి.. కానీ వీరిద్దరు మాత్రం ప్రేమించుకున్న కూడా చాలా పద్ధతిగా బయట తిరగకుండా ప్రేమించుకున్నారు. వీరిద్దరి ప్రేమ ఎంతో మందికి ఆదర్శమనడంలో సందేహం లేదు.
mahesh babu and namrata love story interesting issues
ప్రేమించుకున్న వారిలో చాలా మంది విడిపోయారు.. ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకున్నాం అని కాకుండా ప్రేమగా పెళ్లి తర్వాత కూడా ఉండడం కేవలం వీళ్ళకే చెల్లింది అనడంలో సందేహం లేదు. వీళ్లకు ఇద్దరు పిల్లలు, ఆ ఇద్దరు పిల్లలు ప్రేమ పంచే విధానం అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. సూపర్ స్టార్ అయిన మహేష్ బాబు కుటుంబ బాధ్యతలను తీసుకోవడంలో కాస్త వెనకే ఉంటాడు, కనుక ఆ బాధ్యతలను పూర్తిగా తన భుజాన వేసుకుంది. నమ్రత అందుకే ఆమె సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంది. పిల్లలు పెద్దవాళ్లయిన ఈ సమయంలో వ్యాపారంలో తల దూచుతుంది. కానీ సాధారణంగా అయితే నమ్రత పూర్తిగా కుటుంబ వ్యవహారాలకి పరిమితం అయ్యేది. ఇలాంటి భార్య దొరకడం నిజంగా మహేష్ బాబు అదృష్టం అంటూ అంతా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు.
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
Vivo | స్మార్ట్ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
This website uses cookies.