Anasuya : బుల్లితెరతో పాటు వెండితెరపై తన అందచందాలతో అదరగొడుతున్న అందాల ముద్దుగుమ్మ అనసూయ. పుష్ప చిత్రంలో సునీల్ భార్య గా అనసూయ డీగ్లామర్ రోల్ లో నటించిన సంగతి తెలిసిందే. పుష్ప పార్ట్ 2 లో ఆమె రోల్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి పెరిగింది. పుష్ప 2 లో అనసూయ పాత్ర షాకింగ్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక అనసూయ అందం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్లామర్ పరంగా అనసూయ ఒక రేంజ్ లో రచ్చ చేస్తోంది. సినిమాల ఎంపిక విషయంలో ఎప్పుడూ తొందరపడదు. జబర్దస్త్ కామెడీ షోకి గుడ్ బై చెప్పిన ఆమె మరిన్ని షోలకు యాంకరింగ్ చేస్తున్నారు.అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే అనసూయ ఒక ట్వీట్ చేయగా అది ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపింది.
ఇటీవల మంత్రి కేటీఆర్ గుజరాత్ బిల్కిన్ బానో సామూహిక అత్యాచారం కేసులో జైలుకు వెళ్లిన దోషులు విడుదలయ్యాక వారికి ఒక సంస్థ సన్మానం చేయడంతో వారికి కౌంటర్ ఇస్తూ ఒక ట్వీట్ చేశారు. దాన్ని అనసూయ రీట్వీట్ చేయడంతో పలువురు నెటిజెన్లు అనసూయను టార్గెట్ చేశారు. మరి అప్పట్లో హైదరాబాదులో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగిన సమయంలో మీరు ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నించారు. దీనిపై అనసూయ వరుసగా ట్వీట్స్ చేసింది. నేను ఎలాంటి ట్వీట్ చేసినా అది నా సొంత వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే తప్ప ఎవరినీ, దేనినీ ప్రమోట్ చేయడానికి కాదని ఆమె రిప్లై ఇచ్చింది.
మీరు అలా ఉన్నప్పుడు రాజకీయ విషయాల మీద ట్వీట్స్ చేయడం మానుకోండి మీరు ముందుగా ఆర్టిస్ట్ అని ఒప్పుకోండని సదరు నైటిజన్ ట్వీట్ చేశారు. దానికి ఘాటుగా స్పందించిన అనసూయ నేను ముందు మనిషిని తర్వాత స్త్రీని ఆ తర్వాతే మిగతావన్నీ అంటూ కౌంటర్ ఇచ్చారు.ఇండస్ట్రీలో ఆడవాళ్లంటే ముఖ్యంగా హీరోయిన్స్‌కు ఇచ్చే ప్రాధాన్యత చాలా తక్కువ. హీరోయిన్అంటే కెమెరా ముందు కాపాడండి అంటూ ఉండాలి. లేదా సిగ్గుపడుతూ నవ్వాలి. అదే మా పని. అస్సలు మాట్లాడకూడదు. పోకిరి సినిమాలో గిల్లితే గిల్లించుకోవాలి అనే డైలాగ్ఉంది కదా. సేమ్అలాగే ఇక్కడ పరిస్థితి ఉంటుంది అని అన్నారు. అనసూయ కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. తాను ఏ ట్వీట్ చేసినా అది తన సొంత ఆసక్తి మాత్రమేనని చెప్పింది. తాను ఎవరినీ ప్రమోట్ చేసేందుకో.. డబ్బుల కోసమో ట్వీట్స్ చేయడం లేదని తెలిపింది. తన ట్వీట్స్‌ను రాజకీయం చేయవద్దంటూ నెటిజన్లను కోరింది.
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
This website uses cookies.