Apple : యాపిల్ కంపెనీ ప్రొడక్ట్స్ వాడుతున్న వినియోగదారులను కంపెనీ అలర్ట్ చేసింది. తమ ఉత్పత్తులలోని సాఫ్ట్ వేర్ లలో లోపాన్ని గుర్తించినట్లు ఆపిల్ సంస్థ హెచ్చరిక జారీ చేసింది. ఆపిల్ కు సంబంధించిన కొన్ని ఉత్పత్తులలో ఉపయోగిస్తున్న సాఫ్ట్ వేర్లో కొన్ని లోపాలను గుర్తించినట్లు కంపెనీ తెలిపింది. వీటిని ఆసరాగా తీసుకుని హ్యాకర్లు డివైసులను తమ కంట్రోల్లోకి తీసుకుని అవకాశం ఉందని అంటున్నారు. అందువలన వెంటనే సాఫ్ట్ వేర్లను అప్ డేట్ చేసుకోవాలని యూజర్లను సూచించింది. అయితే యూజర్లను సాఫ్ట్వేర్ ఎలా అప్డేట్ చేసుకోవాలో ఈ క్రింది విధంగా తెలిపింది.
ఐఫోన్ 6ఎస్ తర్వాత మోడల్స్ ఐపాడ్ ఫిఫ్త్ జనరేషన్ ఆ తర్వాత మోడల్స్ తో పాటు ఐపాడ్ లోను ఈ సాఫ్ట్ వేర్ లోపాన్ని గుర్తించారు. అలాగే కొన్ని మ్యాక్ కంప్యూటర్లలోని సాఫ్ట్ వేర్ లోపాలను గుర్తించారు. ఈ ఉత్పత్తులను వారుతున్న వారందరూ వెంటనే సాఫ్ట్ వేర్ ను అప్డేట్ చేసుకోవాలని ఆపిల్ కంపెనీ సూచించింది. అయితే ఈ టెక్నికల్ లోపాన్ని అదునుగా తీసుకొని ఇప్పటివరకు ఏమైనా దాడులు జరిగాయా అంటే దానిపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు కంపెనీ. సాఫ్ట్ వేర్ అప్డేట్ చేసుకోవాలని వినియోగదారులకు సూచించారు.
ఆపిల్ వినియోగదారులు సాఫ్ట్ వేర్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే ముందుగా డివైస్ సెట్టింగ్స్ లోకి వెళ్లి జనరల్ సెక్షన్ లో ఉన్న సాఫ్ట్ వేర్ అప్డేట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. వెంటనే డౌన్లోడ్ అండ్ ఇన్ స్టాల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే సాఫ్ట్ వేర్ అప్డేట్ అవుతుంది. ఈ లోపాలను అదునుగా చేసుకొని హ్యాకర్లు డివైజ్ లను తమ అధీనంలోకి తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో వ్యక్తిగత డేటా తో పాటు బ్యాంక్ అకౌంట్లు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని సూచిస్తున్నారు. కాబట్టి యాపిల్ యూజర్లు వెంటనే సాఫ్ట్ వేర్ అప్డేట్ చేసుకోవడం మంచిది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.