Mahesh Babu – Rajamouli : మహేష్ బాబు- రాజమౌళి సినిమా బడ్జెట్ ఎంత అని అడిగిన జేమ్స్ కామెరూన్ .. జక్కన్న చెప్పిన ఆన్సర్ తో బిత్తరపోయాడు !

 Authored By prabhas | The Telugu News | Updated on :9 February 2023,11:00 am

Mahesh Babu – Rajamouli : టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి ‘ ఆర్ఆర్ఆర్ ‘ సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. ఈ సినిమా ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవలే ఈ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబల్ అవార్డు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. ఇక ఈ సినిమా తర్వాత జక్కన్న మహేష్ బాబుతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం వీరిద్దరి సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Mahesh Babu and SS Rajamouli film update

Mahesh Babu and SS Rajamouli film update

అయితే ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంతవరకు రానటువంటి కథాంశంతో రాజమౌళి సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి వచ్చింది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం జక్కన్న 15 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నాడని తెలుస్తుంది. స్క్రిప్ట్ ఫైనల్ స్టేజ్ కు రావడంతో జూన్ లేదా జూలై నెలలో లాంచింగ్ ఉండనుందని తెలుస్తుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ నెలలో ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది.

Mahesh Babu and SS Rajamouli film update

Mahesh Babu and SS Rajamouli film update

ఇక రాజమౌళి సినిమాను పక్క ప్రణాళికతో ఏడాదిలో ముగించేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా 2025లో విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా కథను పూర్తి చేసే విషయంలో జక్కన్న, అతని తండ్రి విజయేంద్ర ప్రసాద్ బిజీగా ఉన్నారు. సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు రూపొందని విధంగా 800 కోట్ల బడ్జెట్ తో మహేష్ బాబు తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కె. ఎల్ నారాయణ నిర్మించనున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు. ఇది అయిపోగానే జక్కన్న డైరెక్షన్లో సినిమా చేయనున్నాడు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి