Mahesh Babu – Rajamouli : మహేష్ బాబు అంటే రాజమౌళి కి అంత ఇష్టమా ?? సూపర్ స్టార్ ఫ్యాన్స్ తెలుసుకోవాల్సిన న్యూస్ ఇది !

Authored By Breaking News | The Telugu News | Published on: June 2, 2023, 9:00 pm

Mahesh Babu – Rajamouli : ఇండియన్ జేమ్స్ కామెరున్ గా పేరు సంపాదించిన ఎస్ఎస్ రాజమౌళి నెక్స్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పనులపై జక్కన్న ఫుల్ బిజీగా ఉన్నారు. జులై నెలలో ఈ సినిమాకి సంబంధించి కీలక ప్రకటన రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గ్లోబల్ మూవీలో తెరకెక్కించే ఆలోచనలో జక్కన్న ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా జంగిల్ అడ్వెంచర్ గా తెరకెక్కుతుందని స్క్రిప్ట్ ఆ దిశగానే రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. “RRR” సినిమాతో ప్రపంచవ్యాప్తంగా రాజమౌళికి ఓ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అయింది.

Rajamouli likes Mahesh Babu so much

Rajamouli likes Mahesh Babu so much

దీంతో ఆ దిశగానే మహేష్ బాబుని భారీ ఎత్తున చూపించడానికి.. యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే మహేష్ బాబుతో సినిమా కోసం రాజమౌళి ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. “బిజినెస్ మాన్” ఆడియో ఫంక్షన్ సమయంలో కచ్చితంగా సినిమా ఉంటుంది అది జేమ్స్ బాండ్ తరహాలోనా మరింకా ఏ తరహాలో ఉంటుందో నేను చెప్పలేను అని జక్కన్న కామెంట్లు చేయడం జరిగింది. కాక తాజాగా మాత్రం మహేష్ ని వరల్డ్ వైడ్ సూపర్ స్టార్ గా ఒక అద్భుతమైన హీరో ఇజం పాత్రలో ప్రపంచంలో ఏ దర్శకుడు చూపించని విధంగా ఈ సినిమాలో చూపించబోతున్నట్లు సమాచారం.

Rajamouli likes Mahesh Babu so much

Rajamouli likes Mahesh Babu so much

ఇందుకోసం ప్రత్యేకంగా మహేష్ బాబు లుక్ పూర్తిగా మార్చే విధంగా రాజమౌళి క్యారెక్టర్ డిజైన్ చేయడం జరిగిందట. జుట్టు గుబరుగా ఉండబోతుందని.. ఇంకా బాడీ షేప్ కూడా మారనుందని టాక్. ఈ రకంగా మహేష్ బాబుని ప్రపంచంలో ఒక సూపర్ హీరోగా రాజమౌళి తన లేటెస్ట్ సినిమాలో చూపించే దిశగా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. కచ్చితంగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి రాజమౌళి ప్రాజెక్టు పూనకాలు తెప్పిస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. రాజమౌళికి మహేష్ అంటే ప్రత్యేకమైన అభిమానం కావడంతోనే.. ఈ రకంగా ప్రపంచంలో ఏ దర్శకుడు చూపించని హీరోఇజం తన నెక్స్ట్ సినిమాలో చూపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Breaking News

No bio available for this author.

  1. "LPG Gas Connection : కొత్త LPG గ్యాస్ కనెక్షన్లు ఎందుకు ఆగిపోయాయి? అసలు కారణం ఇదేనా..?"

  2. "Snigdha : నేను లెస్బియన్ కాదు.. నచ్చితే అమ్మాయినైనా పెళ్లి చేసుకుంటా”.. నటి స్నిగ్ధ క్లారిటీ"

  3. "Daily Walking : మీ వయసుకు తగ్గట్టు రోజూ ఎన్ని అడుగులు నడవాలి? వాకింగ్ లెక్కలు ఇవే!"

  4. "Onion Garlic During Fasting : ఉపవాసంలో ఉల్లిపాయ, వెల్లుల్లి ఎందుకు తినకూడదు? దీని వెనుక ఉన్న పురాణ కథ ఇదే"

  5. "Pawan Kalyan : జనసేన త్యాగానికి తగిన ప్రాతినిధ్యం దక్కాలి.. పవన్ కల్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!"

  6. "Bigg Boss Telugu 10 : బూతులు మాట్లాడకపోతే నీతిమంతులా? అపూర్వపై శివాజీ ఫైర్.. బిగ్ బాస్ బజ్‌లో రచ్చ"

  7. "Ranabaali Movie : రణబాలి సినిమాకు భారీ బడ్జెట్.. విజయ్, రష్మిక రెమ్యునరేషన్ ఎన్ని కోట్లంటే..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp