Home » Entertainment » Mahesh Babu And Venkatesh Playing Cards
Entertainment

Mahesh Babu – Venkatesh : పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిపోయిన మహేష్ బాబు, వెంకటేష్ .. క్లబ్ లో ఫోటోలు వైరల్..

Authored By
aruna
The Telugu News | Published on: November 5, 2023, 4:00 pm
Advertisement

Mahesh Babu – Venkatesh : తెలుగు పరిశ్రమలో తనదైన శైలిలో అలరిస్తున్న హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. సినిమా సినిమాకి తన మార్కెట్ ను, ఫాలోయింగ్ పెంచుకుంటూ వెళుతున్న అతడు బ్రేక్ లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు. అదే సమయంలో ప్రైవేట్ కంపెనీలతోనూ టై అప్ అవుతూ బిజినెస్ మాన్ అని నిరూపించుకున్నాడు. అయితే తాజాగా మహేష్ బాబు, టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తో పేకాట ఆడుతూ కనిపించారు. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘ గుంటూరు కారం ‘ సినిమా చేస్తున్నాడు.

Advertisement

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వచ్చే సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. వరుసగా సినిమాలు చేస్తూ తీరిక లేకుండా గడుపుతున్న మహేష్ బాబు ఎన్నో బ్రాండ్లకి అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో నేషనల్ గుర్తింపు ఉన్న కంపెనీలు కూడా ఉన్నాయి. కమర్షియల్ యాడ్స్ లో కూడా ఎక్కువగా నటిస్తున్నారు. తద్వారా ఫుల్లుగా సంపాదిస్తూ దూసుకెళుతున్నారు. షూటింగ్ పరంగా ఎంతో బిజీగా ఉండే మహేష్ బాబు ఖాళీ సమయంలో ఎక్కువగా ఫ్యామిలీతోనే గడుపుతారు. అలాగే ప్రైవేట్ ఈవెంట్, స్పెషల్ పార్టీలు, ఓపెనింగ్స్, ఫంక్షన్లకు కూడా వెళుతూ ఉంటారు.

Mahesh Babu And Venkatesh Playing Cards

Advertisement

తాజాగా మహేష్ బాబు బడా కంపెనీ ఏర్పాటు చేసిన క్లబ్ హౌస్ ఈవెంట్ కి హాజరు అయ్యారు. ఇందులో పేకాట ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. మహేష్ బాబు తో పాటు విక్టరీ వెంకటేష్ కూడా పేకాట ఆడుతూ కనిపించారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ సరదాగా పేకాట ఆడుతుండగా ఎవరో ఫోటోలు తీశారు. అంతేకాదు వీటిని సోషల్ మీడియాలో షేర్ చేసి చిన్నోడు పెద్దోడు పేకాట ఆడుతున్నారు అని క్యాప్షన్ పెట్టారు. ఎందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఇద్దరు స్టార్ హీరోని పేకాట ఆడుతూ కనిపించడంతో అభిమానులు షాక్ అవుతున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి