Mahesh Babu : మహేశ్ బాబు అతడు మూవీ సూపర్ హిట్ అయినా నిర్మాతలకు న‌ష్టాల‌కు అత‌నే కార‌ణ‌మా..? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Mahesh Babu : మహేశ్ బాబు అతడు మూవీ సూపర్ హిట్ అయినా నిర్మాతలకు న‌ష్టాల‌కు అత‌నే కార‌ణ‌మా..?

Mahesh Babu : మహేశ్ బాబు కెరీయర్లో అతడు సినిమా బిగ్గెస్ట్ హిట్. ఈ సినిమాను ఇప్పటికీ బుల్లి తెర మీద ప్రసారం చేస్తే టాప్ రేంజ్ లో టీఆర్పీ సాధిస్తూ ముందుకు దూసుకుపోతుంది. అంటే అతడు హవా ఎంతలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంతలా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన అతడు సినిమా నిర్మాతకు మాత్రం నష్టాల్నే మిగిల్చిందట. అసలు నిర్మాతకు నష్టాలు రావడానికి గల కారణం ఏంటని పలువురు ఆలోచిస్తున్నారు. దర్శకుడు […]

 Authored By mallesh | The Telugu News | Updated on :13 November 2021,2:00 pm

Mahesh Babu : మహేశ్ బాబు కెరీయర్లో అతడు సినిమా బిగ్గెస్ట్ హిట్. ఈ సినిమాను ఇప్పటికీ బుల్లి తెర మీద ప్రసారం చేస్తే టాప్ రేంజ్ లో టీఆర్పీ సాధిస్తూ ముందుకు దూసుకుపోతుంది. అంటే అతడు హవా ఎంతలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంతలా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన అతడు సినిమా నిర్మాతకు మాత్రం నష్టాల్నే మిగిల్చిందట. అసలు నిర్మాతకు నష్టాలు రావడానికి గల కారణం ఏంటని పలువురు ఆలోచిస్తున్నారు.

దర్శకుడు త్రివిక్రమ్ తన రెండో సినిమానే మహేశ్ వంటి పెద్ద స్టార్ తో చేయడం నిర్మాతకు నష్టం రావడానికి ఒక కారణమని వాదన వినిపిస్తుంది.అతడు సినిమా హిట్ గా నిలిచినా కానీ సినిమాను నిర్మించిన జయభేరి ఆర్ట్స్ అధినేత, సీనియర్ హీరో మురళీ మోహన్ కు నష్టాలే మిగిలాయని ఇండస్ట్రీ కోడై కూస్తుంది. మురళీ మోహన్ కు అనుకోని నష్టాలు రావడానికి ప్రధాన కారణం సినిమాను తెరకెక్కించిన త్రివిక్రమ్ శ్రీనివాసే అనే విమర్శ కూడా ఉంది.

మెగా ఫోన్ పట్టిన తర్వాత రెండో సినిమాకే త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేశ్ వంటి పెద్ద స్టార్ ను డైరెక్ట్ చేసే చాన్స్ కొట్టేశాడు. దీంతో ఉబ్బి తబ్బిబ్బయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ బడ్జెట్ విషయంలో సరిగ్గా నిబంధనలు పాటించలేదట. మొదట అనుకున్న దాని కంటే సినిమా బడ్జెట్ చాలా పెరిగిపోయిందట. ఈ కారణం వలనే అతడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా కానీ నిర్మాతకు మాత్రం నష్టాలను మిగిల్చిందని చెబుతారు.

Mahesh babu Athadu Movie producers suffered

Mahesh babu Athadu Movie producers suffered

Mahesh Babu.. త్రివిక్రమే కారణమా…

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో అతడు ఎంత బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్లో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. 2005లో వ‌చ్చిన ఈ సినిమాలో మ‌హేష్ బాబు స‌ర‌స‌న త్రిష హీరోయిన్‌గా న‌టించింది. బ‌ల‌మైన క‌థ‌, స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమాగా వ‌చ్చిన అత‌డు ప్రేక్ష‌కుల‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా పొందింది. పైగా జ‌య‌భేరీ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై సీనియ‌ర్ హీరో మాగంటి ముర‌ళీమోహ‌న్ ఈ సినిమాను నిర్మించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ అప్పటికే మల్లీశ్వరి, మన్మధుడు, నువ్వు నాకు నచ్చావ్, నువ్వే కావాలి వంటి హిట్ సినిమాలకు కథలు అందించి మంచి ఫామ్ లో ఉన్నాడు.

అంతే కాకుండా దర్శకుడిగా మారి తరుణ్ వంటి లవర్ బాయ్ తో నువ్వే నువ్వే వంటి హిట్ సాధించారు. దీంతో సీనియర్ నటుడయినా మురళీ మోహన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు చాన్స్ ఇచ్చాడని చెబుతారు. మురళీ మోహన్ అంచనాలను తారు మారు చేయని త్రివిక్రమ్ శ్రీనివాస్ అతడు సినిమాను బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిపాడు. కానీ ఈ సినిమా మాత్రం నిర్మాతకు లాభాలను తీసుకురాకపోవడం చాలా బాధాకరం అనే చెప్పుకోవాలి.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది