Mahesh Babu Birthday : మ‌హేష్ బాబు బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. గుంటూరు కారం మూవీ మాస్ పోస్ట‌ర్ రిలీజ్‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Mahesh Babu Birthday : మ‌హేష్ బాబు బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. గుంటూరు కారం మూవీ మాస్ పోస్ట‌ర్ రిలీజ్‌..!

ఈరోజు టాలీవుడ్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు పుట్టినరోజు. దీని సందర్భంగా ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ గుంటూరు కారం ‘ సినిమా అప్డేట్స్ కోసం ఎదురు చూశారు. ఈ క్రమంలోనే ఆ సినిమా నుంచి కొత్త పోస్టర్ విడుదల అయింది. గుంటూరు కారం సినిమాని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అంతకుముందు త్రివిక్రమ్, మహేష్ […]

 Authored By aruna | The Telugu News | Updated on :9 August 2023,11:05 am

ఈరోజు టాలీవుడ్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు పుట్టినరోజు. దీని సందర్భంగా ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ గుంటూరు కారం ‘ సినిమా అప్డేట్స్ కోసం ఎదురు చూశారు. ఈ క్రమంలోనే ఆ సినిమా నుంచి కొత్త పోస్టర్ విడుదల అయింది. గుంటూరు కారం సినిమాని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అంతకుముందు త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్లో ఖలేజా, అతడు సినిమాలు వచ్చాయి.

ఖలేజా ఫ్లాప్ అయిన అతడు బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇంకా ఖలేజా సినిమా టీవీ, యూట్యూబ్ ద్వారా సూపర్ హిట్ అయింది. ఈ క్రమంలోనే హ్యాట్రిక్ సినిమాతో రాబోతున్న గుంటూరు కారం సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా నుంచి సరైన అప్డేట్స్ రావట్లేదు. ఏం జరుగుతుందో ఫ్యాన్స్ కి అర్థం కావట్లేదు. సూపర్ స్టార్ కృష్ణ జయంతి రోజున మహేష్ చేస్తున్న సినిమాకి గుంటూరు కారం అని టైటిల్ ఫిక్స్ చేసి వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. వచ్చే సంవత్సరం జనవరి 13న విడుదల చేనున్నట్లు ప్రకటించారు.

Mahesh Babu Birthday Special Guntur Kaaram Poster release

Mahesh Babu Birthday Special Guntur Kaaram Poster release

ఇప్పుడు మహేష్ పుట్టినరోజు సందర్భంగా కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే అందులో రిలీజ్ డేట్ మారింది. జనవరి 12న విడుదల చేయబోతున్నట్లు చెప్పారు. ఈసారైనా కరెక్ట్ డేట్ కి విడుదల చేస్తారా లేదా చూడాలి. ఈ సినిమాలో మొదటగా పూజ హెగ్డే, శ్రీ లీల లను హీరోయిన్స్ అనుకున్నారు. అయితే ఈ ప్రాజెక్టు నుంచి పూజా హెగ్డే తప్పుకోగా శ్రీలీల మెయిన్ హీరోయిన్ అయిపోయింది. హీరోయిన్ మీనాక్షి చౌదరి కొత్తగా వచ్చి చేరింది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి అవి నిజం కాదని తేలింది. ఇక అభిమానులు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ వస్తుందని ఆశపడ్డారు కానీ పోస్టర్ ను విడుదల చేసి అభిమానులను నిరుత్సాహపరిచారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది