Mahesh Babu Birthday Special Guntur Kaaram Poster release
ఈరోజు టాలీవుడ్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు పుట్టినరోజు. దీని సందర్భంగా ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ గుంటూరు కారం ‘ సినిమా అప్డేట్స్ కోసం ఎదురు చూశారు. ఈ క్రమంలోనే ఆ సినిమా నుంచి కొత్త పోస్టర్ విడుదల అయింది. గుంటూరు కారం సినిమాని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అంతకుముందు త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్లో ఖలేజా, అతడు సినిమాలు వచ్చాయి.
ఖలేజా ఫ్లాప్ అయిన అతడు బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇంకా ఖలేజా సినిమా టీవీ, యూట్యూబ్ ద్వారా సూపర్ హిట్ అయింది. ఈ క్రమంలోనే హ్యాట్రిక్ సినిమాతో రాబోతున్న గుంటూరు కారం సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా నుంచి సరైన అప్డేట్స్ రావట్లేదు. ఏం జరుగుతుందో ఫ్యాన్స్ కి అర్థం కావట్లేదు. సూపర్ స్టార్ కృష్ణ జయంతి రోజున మహేష్ చేస్తున్న సినిమాకి గుంటూరు కారం అని టైటిల్ ఫిక్స్ చేసి వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. వచ్చే సంవత్సరం జనవరి 13న విడుదల చేనున్నట్లు ప్రకటించారు.
Mahesh Babu Birthday Special Guntur Kaaram Poster release
ఇప్పుడు మహేష్ పుట్టినరోజు సందర్భంగా కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే అందులో రిలీజ్ డేట్ మారింది. జనవరి 12న విడుదల చేయబోతున్నట్లు చెప్పారు. ఈసారైనా కరెక్ట్ డేట్ కి విడుదల చేస్తారా లేదా చూడాలి. ఈ సినిమాలో మొదటగా పూజ హెగ్డే, శ్రీ లీల లను హీరోయిన్స్ అనుకున్నారు. అయితే ఈ ప్రాజెక్టు నుంచి పూజా హెగ్డే తప్పుకోగా శ్రీలీల మెయిన్ హీరోయిన్ అయిపోయింది. హీరోయిన్ మీనాక్షి చౌదరి కొత్తగా వచ్చి చేరింది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి అవి నిజం కాదని తేలింది. ఇక అభిమానులు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ వస్తుందని ఆశపడ్డారు కానీ పోస్టర్ ను విడుదల చేసి అభిమానులను నిరుత్సాహపరిచారు.
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
This website uses cookies.