
mahesh babu brother Ramesh Babu cine career
Ramesh Babu : నటుడు సూపర్ స్టార్ కృష్ణ తనయుడు, మహేష్ బాబు సోదరుడు.. ఘట్టమనేని రమేష్ బాబు (56) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన..పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో కన్ను మూశారు. రమేష్ బాబు మరణం తెలుగు చిత్ర పరిశ్రమను దిగ్ర్భాంతికి గురి చేసింది. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.రమేష్ బాబు మొదటి సంతానం. కృష్ణ సినీ పరిశ్రమను ఏలుతున్న సమయంలో 1974 లోనే అల్లూరి సీతారామ రాజు సినిమాతో బాలనటుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి…
దాదాపు 20కి పైగా చిత్రాల్లో నటించారు రమేష్ బాబు. అన్నదమ్ముల సవాల్, నీడ, పాలు, దొంగలకు దొంగ వంటి పలు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు. రమేష్ బాబు 1987లో సామ్రాట్ అనే సినిమాతో అఫిషియల్ గా హీరోగా పరిచయమయ్యారు. అనంతరం… మామ కోడలు, అన్నా చెల్లెలు, చిన్ని కృష్ణుడు, బజార్ రౌడీ, కలియుగ కృష్ణుడు, ముగ్గురు కొడుకులు, బ్లాక్ టైగర్, కృష్ణగారి అబ్బాయి, పచ్చ తోరణం ఎన్ కౌంటర్ వంటి చిత్రాలతో మెప్పించారు. 1997లో వచ్చిన ఎన్ కౌంటర్ సినిమా చేసిన తర్వాత ఆయన చిత్రాలకు పూర్తిగా దూరం అయ్యారు. అనంతరం.. నిర్మాతగా మారి ఆ సినిమాలు కూడా సరిగా ఆడకపోవడంతో.. ఆ ఫీల్డ్ కు కూడా ముగింపు పలికారు.
mahesh babu brother Ramesh Babu cine career
రమేష్ బాబు సినీ కెరియర్ లో భారీ అంచనాలు క్రియేట్ చేసిన సినిమా సాహస యాత్ర నిర్మాణ దశలోనే ఆగిపోయింది. అప్పట్లో దర్శకుడు పెద్ద వంశీ మంచి క్రేజ్ లో ఉన్నప్పుడు రమేష్ బాబు హీరోగా అడ్వెంచర్ ఫిల్మ్ గా సాహస యాత్ర కథను సిద్ధం చేశారు. మబ్బు చంద్రశేఖర్ రెడ్డి సమర్పణలో నూరా నరేంద్ర రెడ్డి, టి.వి.ఎస్.రెడ్డి నిర్మాతలుగా ఈ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమయ్యారు. రమేష్ బాబు తండ్రి కృష్ణకు కూడా ఈ కథ నచ్చడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సినిమా బడ్జెట్ విషయాలు అన్ని పూర్తి అయిన అనంతరం ఓ షెడ్యూల్ ను కూడా పూర్తి చేశారు. గౌతమి, రమ్యకృష్ణ, మహాలక్ష్మి, రమేష్ బాబు లతో కలిసి కొన్ని సీన్స్ కూడా తీశారు.
ఇళయరాజా సంగీత దర్శకత్వంలో ఓ పాటను కూడా రికార్డ్ చేశారు. అయితే ఆ తర్వాతే అసలు సమస్య వచ్చి పడింది. దర్శకుడు వంశీకి, నిర్మాతలకు ఏవో ఇబ్బందులు వచ్చాయి. వంశీని, ఇళయ రాజాను కూడా మార్చి వారి స్థానంలో రాజ్ కోటిని తీసుకున్నారు. అయితే అది కూడా విజయవంతం కాకపోగా సినిమా మొత్తాన్నే ఆపేశారు. నిర్మాతకు, దర్శకుడికి పడలేదని కొంత మంది చెబితే.. ఆర్థిక కారణాలతోనే సాహస యాత్ర సినిమా ఆగిపోయిందని అప్పట్లో అనేవారు.ఏది ఏమైనప్పటికీ ఈ సినిమా పూర్తిగా తెరకెక్కి ఉంటే.. రమేష్ బాబు సినీ కెరియర్ మరోలా ఉండేదేమో.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.