Mahesh Babu – Rajamouli : దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో సినిమా అంటే ఉండే అంచనాలు ఊహించడం చాలా కష్టం. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాకుండా విదేశీ బాక్సాఫీస్ వద్ద కూడా సత్తా చాటారు జక్కన్న. డివైడ్ టాక్‌తోనే దాదాపు 1100 కోట్ల వరకు వసూళ్ళు రాబట్టి అందరికీ షాకిచ్చింది. ఇలాంటి అగ్ర దర్శకుడు మొదటిసారి సూపర్ స్టార్ మహేశ్ బాబుతో పాన్ ఇండియా స్థాయిలో సినిమాను చేస్తున్నారంటే ముందు మహేశ్‌ను పక్కాగా ఒప్పించాల్సింది కథ తోనే.
ఇక ఈ కాంబోలో సినిమా అనే మాట ఇప్పటిది కాదు. ఓ పదేళ్ళ క్రితం అనుకున్న ప్రాజెక్ట్. కానీ, ఇప్పటికీ కదలికలు మొదలయ్యాయి. అఫీషియల్‌గా ఇంకా ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు. చేసేది మాత్రం పక్కా. ఇటీవల మహేశ్ బాబు కూడా సర్కారు వారి పాట సినిమాతో వచ్చి చాలా ఏళ్ళ తర్వాత ఫ్లాప్ చూడారు. ప్రస్తుతం మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. జూలై లేదా ఆగస్టు నుంచి ఈ మూవీ సెట్స్ మీదకు రాబోతోంది. ఈ ఏడాది డిసెంబర్ వరకు షూటింగ్ కంప్లీట్ చేయాలని మహేశ్, త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి కారణం వెంటనే రాజమౌళి సినిమాను సెట్స్ మీదకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.
అయితే, ఇప్పటివరకు పూర్తి స్థాయిలో కథే సిద్ధం కాలేదని సమాచారం. ఇటీవలే బేసిక్ లైన్ ఒకటి మహేశ్ బాబుకు చెప్పారట రాజమౌళి. అది కూడా ఫైనల్ కాలేదనే టాక్ వినిపిస్తుంది. అంతేకాదు, బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ను ఈ సినిమాలో మహేశ్ సరసన నటింపచేయడానికి జక్కన్న ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అంతేకాదు, మరికొందరు బాలీవుడ్ స్టార్ కూడా నటించనున్నట్టు చెప్పుకుంటున్నారు. అయితే, ఇవన్నీ కేవలం రూమర్సేనట. అసలు కథ కూడా ఓ కొలిక్కి రాలేదని తెలుస్తోంది. మహేశ్ – రాజమౌళి ప్రాజెక్ట్ మొదలవ్వాలంటే ఇంకా చాలా సమయం పడుతుందని ఇండస్ట్రీ వర్గాలలో టాక్. బహుషా 2023 సమ్మర్ తర్వాతే ఈ ప్రాజెక్ట్ మూవ్ అవుతుందట.
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.