Guntur Karam Movie : శ్రీ లీల డ్యాన్స్ చూస్తుంటే మతి పోతుంది.. ఈ పిల్లతో పవన్ కళ్యాణ్ అన్న ఎలా చేస్తాడో.. మహేష్ బాబు ఫన్నీ కామెంట్స్ ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Guntur Karam Movie : శ్రీ లీల డ్యాన్స్ చూస్తుంటే మతి పోతుంది.. ఈ పిల్లతో పవన్ కళ్యాణ్ అన్న ఎలా చేస్తాడో.. మహేష్ బాబు ఫన్నీ కామెంట్స్ ..!

 Authored By anusha | The Telugu News | Updated on :10 January 2024,3:06 pm

ప్రధానాంశాలు:

  •  Guntur Karam Movie : శ్రీ లీల డ్యాన్స్ చూస్తుంటే మతి పోతుంది.. ఈ పిల్లతో పవన్ కళ్యాణ్ అన్న ఎలా చేస్తాడో.. మహేష్ బాబు ఫన్నీ కామెంట్స్ ..!

Guntur Karam Movie : సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ‘ గుంటూరు కారం ‘ సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ నిర్వహిస్తుంది. ఇప్పటికే ట్రైలర్ ను విడుదల చేసారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటించారు. మీనాక్షి చౌదరి గెస్ట్ అపీరియన్స్ ఇచ్చారు. తమన్ సంగీతం అందించారు. ఇక తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. మహేష్ బాబు మాట్లాడుతూ .. ఫంక్షన్ ఎక్కడ చేయాలని త్రివిక్రమ్ తో డిస్కషన్ చేస్తుంటే ఆయన మీ ఊర్లో చేద్దామని చెప్పారు. త్రివిక్రమ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. నా ఫ్యామిలీ పర్సన్ లాగా. గత రెండు సంవత్సరాలుగా ఆయన నాకు ఇచ్చిన సపోర్ట్ మరువలేనిది.

‘ అతడు ‘ సినిమా చేసినప్పటి నుంచి మా జర్నీ మొదలైంది. ఖలేజా లో ఓ మ్యాజిక్ జరిగింది. అదే మ్యాజిక్ ఇప్పుడు గుంటూరు కాలంలో జరిగింది. మీరు కొత్త మహేష్ బాబును చూడబోతున్నారు అని మహేష్ బాబు తెలిపారు. ఇక శ్రీల గురించి చెబుతూ..మన తెలుగు అమ్మాయి ఇంత పెద్ద హీరోయిన్ అవ్వడం ఆనందంగా ఉంది. ఆ అమ్మాయికి షార్ట్ ఉన్నా లేకపోయినా అక్కడే ఉంటుంది. ఈ అమ్మాయితో డాన్స్ వేయటం చాలా కష్టం. వామ్మో అంటూ మహేష్ బాబు చెప్పుకొచ్చారు. ఈమెతో డాన్స్ అంటే హీరోలందరికీ తాట ఊడిపోద్ది. ఆమెతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇక మీనాక్షి చౌదరి గెస్ట్ అప్పియరెన్స్ చేసింది. నేను త్రివిక్రమ్ అడగగానే ఆమె వెంటనే ఓకే చేశారు.

ఇక తమన్ గురించి చెబుతూ..తమను అంటే నాకు చాలా ఇష్టం. నాకు బ్రదర్ లాగా. ఈ సినిమాలో లాస్ట్ పాట కుర్చీ మడతపెట్టి పాట అద్భుతంగా ఇచ్చారు. రేపు థియేటర్లో ఆ పాట చూస్తే థియేటర్స్ బద్దలవుతాయి. థాంక్యూ తమ్ముడు అని మహేష్ తెలిపారు. ఇందాక నా ఏవీ చూసినప్పుడు పాతిక సంవత్సరాలు అని వేశారు. నేను నమ్మలేకపోతున్నాను. సంక్రాంతి నాకు బాగా కలిసి వచ్చిన పండుగ. మా సినిమా సంక్రాంతికి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈసారి ఏదో కొత్తగా ఉంది. నాన్నగారు మా మధ్య లేరు. నా సినిమా చూసి ఫోన్ చేసి చెప్పేవారు. అవన్నీ మీరే చెప్పాలి. ఇక నుంచి మీరే మా అమ్మా నాన్న అన్ని. మీ ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి అని కోరుకుంటున్నాను అని మహేష్ బాబు తెలిపారు.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది