Mahesh Babu : గుంటూరు కారం నా చివరి సినిమా.. రాజమౌళి సినిమా తర్వాత తెలుగు సినిమాలు చేయనని చెప్పిన మహేష్ బాబు..!
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘ గుంటూరు కారం ‘ సినిమా సంక్రాంతి కానుక జనవరి 12న విడుదలై మిక్స్డ్ టాక్ ను సంపాదించుకుంది. అయితే వసూళ్ల పరంగా మాత్రం మంచి కలెక్షన్స్ సాధిస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్తోంది. అయితే రీసెంట్గా మహేష్ బాబు సుమ తో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన చేసిన కామెంట్స్ అభిమానులకు కూడా షాకింగ్ గా అనిపించాయి. గుంటూరు కారం సినిమా నా చివరి చిత్రమని, ఈ సినిమా తర్వాత ఇక సినిమాలు తీయడం ఆపేస్తున్నానని మహేష్ బాబు చెప్పారు. మొత్తానికి సినిమాలు తీయడం మానేస్తానని కాదు తెలుగులో సినిమాలు చేయనని, రాజమౌళి సినిమా తర్వాత పాన్ ఇండియా సినిమాలు చేస్తానని తెలుగు సినిమాలు తక్కువగా చేస్తానని చెప్పారు.
ఇక గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు డాన్స్ కి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక ఇంటర్వ్యూలో సుమా కూడా డాన్స్ గురించి విడిగా చెప్పాల్సిన అవసరం లేదని, మహేష్ బాబు డాన్స్ ఇరగదీసారు అని ప్రశంసించారు. దానికి మహేష్ బాబు మాట్లాడుతూ ముందు నుంచి నేను త్రివిక్రమ్ ఒకటి అనుకున్నాం. రెండు పాటలకు డాన్స్ మాత్రం ఒక రేంజ్ లో చేయాలి అని ముందు నుంచి ఫిక్స్ అయ్యాం. ఎందుకంటే దీని తర్వాత ఇప్పుడు రెగ్యులర్గా తెలుగు సినిమా పాటలు చేస్తామో తెలియదు, అది నేను చేసే చివరి తెలుగు సినిమా అవ్వచ్చు అంటూ మళ్ళీ జాగ్రత్తపడి డాన్సులు విషయంలో చేయగలిగిన చివరి తెలుగు సినిమా ఇదే అవ్వచ్చు అని మహేష్ బాబు కవర్ చేసారు.
ఇక మహేష్ బాబు తర్వాత సినిమా రాజమౌళి తో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఓ భారీ అడ్వెంచర్ సినిమాలో చేయబోతున్నారు. ఇక రాజమౌళి సినిమా అంటే మినిమం రెండు మూడు సంవత్సరాలు పడుతుంది. ఈ క్రమంలోనే మహేష్ బాబు గుంటూరు కారం తెలుగు సినిమా చివరిదని అనుంటారు. ఇక రాజమౌళితో సినిమా అంటే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వస్తుంది. జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ లాగా మహేష్ బాబు కూడా పాన్ ఇండియా హీరో అవుతారు. ప్రస్తుతం రాజమౌళి కూడా మహేష్ బాబు తో సినిమా తీసే ప్లాన్ లో ఉన్నారు. స్టోరీని సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లేలా రాజమౌళి ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా త్వరలోనే పవన్ ఇండియా హీరో అవడం ఖాయం అని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
This website uses cookies.