Home » News » Nari Nari Naduma Murari Movie Review And Rating In Telugu
News

Nari Nari Naduma Murari Movie Review : నారి నారి నడుమ మురారి మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: February 1, 2026, 1:05 pm
Advertisement

Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘నారి నారి నడుమ మురారి’ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించగా, యువ దర్శకుడు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. హాస్య ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సత్య, వీకే నరేష్, సుదర్శన్, సంపత్ రాజ్, శ్రీకాంత్ అయ్యంగార్, సునీల్, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషించారు. భాను భోగవరపు కథ అందించగా, నందు సావిరిగన డైలాగ్స్ రాశారు. జీ శేఖర్, యువరాజ్ సినిమాటోగ్రఫీ చేయగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.

Advertisement

Nari Nari Naduma Murari Movie Review : నారి నారి నడుమ మురారి మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Nari Nari Naduma Murari Movie Review : సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి

ఇటీవల ఈ సినిమా సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుంది. సినిమాలోని కొన్ని అడల్ట్ ఫ్లేవర్ ఉన్న డైలాగ్స్, సన్నివేశాలపై సెన్సార్ బోర్డు స్వల్ప అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో, అధికారుల సూచనల మేరకు అవసరమైన మార్పులు చేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. దీంతో ఎలాంటి వివాదాలు లేకుండా సెన్సార్ పూర్తయింది.

Advertisement

Nari Nari Naduma Murari Movie Review : యూఏ సర్టిఫికెట్, క్రీస్పీ రన్‌టైమ్

ఇద్దరు హీరోయిన్ల మధ్య చిక్కుకున్న యువకుడి పాత్రలో శర్వానంద్ నటించిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూఏ (UA 13+) సర్టిఫికెట్ జారీ చేసింది. 13 ఏళ్లకు పైబడిన వారు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా సినిమా వీక్షించవచ్చు. 13 ఏళ్లకు తక్కువ వయసున్న వారు తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడాల్సి ఉంటుంది.ఇక కథను అనవసరంగా సాగదీయకుండా చిత్ర యూనిట్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. సినిమా నిడివిని *2 గంటల 25 నిమిషాలు (145 నిమిషాలు)గా ఖరారు చేశారు. దీంతో సినిమా క్రీస్పీగా, ల్యాగ్ లేకుండా సాగుతుందని భావిస్తున్నారు.

Nari Nari Naduma Murari Movie Review సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్

యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీగా రూపొందిన ‘నారి నారి నడుమ మురారి’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. శర్వానంద్ మరోసారి సంక్రాంతి బరిలో ఎంటర్‌టైనర్‌తో దూకుతుండటంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి == Gold Price on January 15th : ఈరోజు గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయంటే !!

Nari Nari Naduma Murari Movie Review క‌థ‌ :

ఇంజనీరింగ్ పూర్తి చేసి ఓ ప్రముఖ కంపెనీలో ఆర్కిటెక్ట్‌గా పని చేస్తున్న గౌతమ్‌ (శర్వానంద్) జీవితం సాఫీగా సాగుతుంటుంది. అదే సంస్థలో పనిచేసే సహోద్యోగి నిత్య (సాక్షి వైద్య)తో పరిచయం ప్రేమగా మారుతుంది. ఇద్దరి మధ్య ఏర్పడిన అనుబంధం క్రమంగా బలపడుతూ, వారి ప్రేమాయణం ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతుంది.

అయితే కథలో అనూహ్యమైన మలుపు ఇక్కడే మొదలవుతుంది. అదే కంపెనీలో టీమ్ లీడర్‌గా గౌతమ్ మాజీ ప్రేయసి దియ (సంయుక్త మీనన్) అడుగుపెట్టడంతో పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. దియ ఎంట్రీతో గౌతమ్ జీవితంలో మళ్లీ పాత జ్ఞాపకాలు, భావోద్వేగాలు తెరపైకి వస్తాయి. ఒకవైపు వర్తమాన ప్రేమ, మరోవైపు గత అనుబంధం మధ్య చిక్కుకుని గౌతమ్ పరిస్థితి అక్షరాలా ‘నారీ నారీ నడుమ మురారి’గా మారుతుంది.

అసలు గౌతమ్ ఎవరు? అతడు దియ నుంచి ఎందుకు దూరమయ్యాడు? నిత్యతో ఉన్న ప్రేమపై దియ రాక ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఈ ముగ్గురి మధ్య ఉన్న అసలైన సంఘర్షణ ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ కథను బిగ్ స్క్రీన్‌పైనే ఆస్వాదించాల్సిందే. ప్రేమ, భావోద్వేగాలు, గందరగోళ పరిస్థితులతో కూడిన ఈ ట్రయాంగిల్ స్టోరీ ప్రేక్షకులకు పూర్తి వినోదం అందించనుందని మేకర్స్ చెబుతున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి == Sankranti Festival : సంక్రాంతి పండుగ‌కి ఈ ఆల‌యానికి త‌ప్ప‌క వెళ్లండి.. మీ జాతకం మార‌డం ఖాయం..!

Nari Nari Naduma Murari Movie Review విశ్లేష‌ణ :

సినిమా కథను మరీ సాగదీయకుండా లెంగ్త్ విషయంలో చిత్ర యూనిట్ సరైన జాగ్రత్తలు తీసుకొన్నట్టు స్పష్టమైంది. ఈ సినిమా నిడివి 2 గంటల 25 నిమిషాలకు అంటే 145 నిమిషాల రన్‌టైమ్‌కు పరిమితం చేశారు. దాంతో ఈ సినిమా క్రీస్పీగా, ల్యాగ్ లేకుండా ఉండే అవకాశం ఉందనే అభిప్రాయం కలుగుతున్నది.

Advertisement

ఈ సినిమాలో సత్య, వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్స్ బాగున్నాయి. అలాగే ఎమోషనల్ కంటెంట్ కూడా ఆడియెన్స్‌ను మెప్పిస్తుంది అనే విషయాలు సెన్సార్ రివ్యూ తర్వాత టాక్ పాజిటివ్‌గా మారింది. అంతేకాకుండా ఇటీవల రిలీజైన ట్రైలర్ కూడా మరింత పాజిటివిటీని జోడించింది. అయితే భారీ సినిమాల మధ్య ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను మెప్పించి హిట్ టాక్‌ను సొంతం చేసుకొంటుంది అనే సందేహం అందరిలోను ఉంది.

 

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి