mahesh babu emotional and fun in talk show
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకప్పుడు చాలా కూల్‌గా, ఎవరితో పెద్దగా కలవకుండా సైలెంట్‌గా ఉండేవాడు. ఇప్పుడు అలా కాదు సోషల్ మీడియా ద్వారా అందరికి విషెస్ చేప్తూ ప్రముఖులు హోస్ట్ చేస్తున్న షోలలోను సందడి చేస్తున్నాడు. ఆ మధ్య ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ ఇప్పుడు బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోలోను సందడి చేశాడు. దీనికి సంబంధించిన ప్రోమో శుక్రవారం సాయంత్రం విడుదల కాగా.. ఇందులో మహేష్ బాబు చేస్తున్న గొప్పపనిని కళ్లకి కట్టారు బాలయ్య.
ఫిబ్రవరి 4న ఈ షో ప్రీమియర్ కానుండగా, ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో బాలకృష్ణ మహేష్ బాబు మధ్య ఆసక్తికర సంభాషణలు జరిగాయి. కేబీఆర్ పార్కులో ఒకసారి జాగింగ్ కోసం వెళ్లిన తాను.. మొత్తం పార్కును ఒక రౌండేసి రాగా.. ఎదురుగా ఒక పెద్ద పాము పడగ విప్పి కనిపించిందని.. దాన్ని చూడగానే భయపడిపోయిన మహేష్ మళ్లీ ఆ పార్క్ వైపే చూడలేదని చెప్పాడు. ఇక భరత్ అనే నేను షూటింగ్‌లో భాగంగా ఒక ఇంటెన్స్ సీన్లో తాను సీరియస్‌గా డైలాగ్ చెబుతుంటే ఎదురుగా ఉన్న ఒకావిడ ఫోన్లో గేమ్ ఆడుకుంటూ కనిపించిందని, అది చూసి కోపం వచ్చి ఫోన్ ఆపేయమన్నానని.. అదే మీరు అయితే మైక్ తీసి ఆమె మీద వేసేవారని మహేష్ చమత్కరించడం విశేషం.
mahesh babu emotional and fun in talk show
‘గౌతమ్ ఆరు వారాలు ముందుగానే పెట్టేశాడు.. పుట్టినప్పుడు సరిగ్గా నా చేయి అంతే ఉన్నాడు.. ఇప్పుడు ఆరు అడుగులు ఉన్నాడు.. మాకు డబ్బులు ఉన్నాయి కాబట్టి.. ఓకే కానీ చాలామంది లేని వాళ్లు ఉన్నారు.. మరి వాళ్ల పరిస్థితి ఏంటి? ఆ చిన్నారులు ఏం కావాలి? అలాంటి వాళ్ల కోసం ఏదైనా చేయాలని అనుకున్నాను.. అప్పటి నుంచి చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తున్నా’ అని చెప్పుకొచ్చారు మహేష్ బాబు. ఇక నమ్రత స్టేట్‌మెంట్ ఇచ్చిందని బాలయ్య అనగా, మహేష్ కాస్త పద్దతిగా ప్రవర్తించాడు. దీంతో బాలకృష్ణ బాడీలో డిస్‌ప్లైన్ వచ్చింది అని అన్నాడు. చాలా సందడిగా షో సాగినట్టు ప్రోమోని చూస్తే తెలుస్తుంది.
Shiva Puja Tips : పురాణాల ప్రకారం శివయ్య బోలా శంకరుడు అని అంటారు. ఆయనకు ఇంత కోపం వస్తుందో…
Hindu Deities : ప్రయత్నాలు చేసినా కూడా గ్రహదోషాలు మాత్రం మన వెంట వస్తూనే ఉంటాయి. జన్మతః వరకు ఉంటాయి.…
Vishnupuri Colony : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ విష్ణుపురి కాలనీ వర్షాకాలం దరిచేరగానే వరద ముప్పుకు…
Shilajit In Ayurveda : ఆయుర్వేద శాస్త్రంలో ఎన్నో ఔషధ గుణాలను కలిగిన పదార్థాలు ఉన్నాయి. అలాంటి పదార్థమే శిలాజిత్.…
Patanjali Rose Syrup : ఎండాకాలం వచ్చిందంటే ఎక్కువ షరబతులని తాగుతూ ఉంటారు. కోకా లెమన్ షర్బత్ తాగుతూ ఉంటాం.…
Rohit Sharma : ఐపీఎల్-2025 లో సీఎస్కేతో తాజాగా జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ అద్భుత ప్రదర్శన కనబరిచి ఘన…
Gap In Teeth : కొన్ని శాస్త్రాలు పళ్ళ మధ్య కాలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు.…
Daily One Carrot : కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో దుంపలు కూడా ఒకటి. అవే…
This website uses cookies.