Mahesh Babu : భార్య నమ్రత అంటే మహేష్ బాబు కి అంత పిచ్చి ఎందుకో తెలుసా .. కారణం ఇదే !

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: January 23, 2023, 5:00 pm

Mahesh Babu : ఒకప్పటి మిస్ ఇండియా నమ్రత శిరోద్కర్ బాలీవుడ్ లో పలు సినిమాలు చేసి హీరోయిన్ గా మంచి గుర్తింపును పొందింది. ఇక టాలీవుడ్ లో మహేష్ బాబు సరసన వంశీ సినిమాలో హీరోయిన్ నటించింది. ఆ సినిమా టైం లోనే వీళ్ళిద్దరూ ప్రేమించుకుని పెళ్లి దాకా వెళ్లారు. హీరోయిన్ గా ఫుల్ ఫామ్ లో ఉన్నప్పుడే నమ్రత మహేష్ బాబును పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం టాలీవుడ్లోనే బెస్ట్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు. ఈరోజు నమ్రత బర్త్డే సందర్భంగా మహేష్ బాబు బర్త్ డే విషేస్ తెలిపారు. హ్యపీ బర్త్ డే ఎన్ఎస్జీ అని పెట్టాడు. అంటే దాని అర్థం నమ్రత శిరోద్కర్ ఘట్టమనేని.

నా కోసం అన్ని ప‌నుల‌ను చాలా లైన్లో, క్ర‌మంగా పెడుతున్నందుకు ధ‌న్య‌వాదాలు. న‌న్ను ఎప్ప‌ట‌కీ మ‌రింత ముందుకు న‌డిపిస్తున్నందుకు ఎప్పుడూ నువ్వు నీలాగానే ఉన్నందుకు థాంక్స్ అంటూ బాగా ఎమోషనల్ అయ్యాడు. ఈ మెసేజ్ కు నమ్రత అందమైన ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం నమ్రత సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా గౌతమ్, సితార, మహేష్ ల గురించి ఆసక్తి విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక నమ్రత మహేష్ లైఫ్ లోకి వచ్చాక కెరీర్ పరంగా ఎన్నో మార్పులు వచ్చాయి. మహేష్ సినిమా కథలు వినడం, డేట్ లు చూసుకోవడం,

Mahesh Babu emotional love to his Namrata

Mahesh Babu emotional love to his Namrata

సినిమా ప్రమోషన్స్ లాంటివి చూసుకుంటూ లైఫ్ నీ సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు. ఇకపోతే మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ అంతకుముందే అతడు, ఖలేజా సినిమాలో వచ్చాయి. ఇప్పుడు రాబోయేది మూడవ సినిమా. త్రివిక్రమ్ తో సినిమా పూర్తి అయ్యాక టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతుంది. పాన్ ఇండియా స్థాయి లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp