mahesh babu father says no to marriage
Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. రీల్ శ్రీమంతుడే కాదు, రియల్ శ్రీమంతుడిగాను ఎందరో మనసులు గెలుచుకున్నాడు. 1975 ఆగస్టు 9న జన్మించిన మహేష్ బాబు నేడు 47వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. కృష్ణ వారసుడిగా వెండితెరకు పరిచయమైన తండ్రికి తగ్గ తనయుడు అనిపించారు. ఒక విధంగా చెప్పాలంటే కృష్ణ కంటే ఓ మెట్టు ఎక్కువే ఎదిగారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు గ్రామాలను దత్తత తీసుకున్న మహేష్ బాబు, వేయి మందికి పైగా చిన్నారులకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్స్ చేయించారు. విరామం దొరికితే భార్యాపిల్లలతో విహారాలకు వెళ్లడం మహేష్ కి చాలా ఇష్టం. అలాగే ఇంట్లో సితార, గౌతమ్ తో సరదా ఆదుకోవడం మహేష్ కి ఇష్టమైన వ్యాపకం.
సూపర్ స్టార్ మహేష్ బాబు వ్యవహారాలన్నీ కూడా నమ్రతే చూసుకుంటుందని అందరికీ తెలిసిందే. మహేష్ బాబు సినిమాల్లో నటిస్తుంటాడు. కానీ ఆ సినిమాలకు సంబంధించిన వ్యవహారాలు, ప్రకటనలకు సంబంధిన విషయాలను చూసుకుంటూ ఉంటుంది. భర్తకు తగ్గట్టు నమ్రత నడుచుకుంటూ అందరి మన్ననలు పొందుతుంది. టాలీవుడ్ బెస్ట్ కపుల్స్‌గా వీరికి పేరుంది. వీరిద్దరిని కలిపింది వంశీ సినిమానే. వంశీ షూటింగ్ సమయంలోనే నమ్రత-మహేశ్ ప్రేమలో పడ్డారు. వీరి ప్రేమను మహేష్ తొలుత కుటుంబం అంగీకరించలేదట.
mahesh babu father says no to marriage
దీంతో మహేశ్ తన సోదరి మంజుల సహాయం తీసుకున్నారట. అలా నమ్రత-మహేశ్‌ల పెళ్లి జరగడంలో మంజుల కీలక పాత్ర పోషించిందట. దాదాపు ఐదేళ్ల ప్రేమాయణం అనంతరం 2005 ఫిబ్రవరి 10న నమ్రత-మహేశ్‌లు పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత మహేష్ ప్రతి విషయంలో నమ్రత ఉంటుంది. సినిమా ప్రమోషన్స్ నుంచి కాస్ట్యూమ్స్ వరకు అన్నీ నమ్రతే దగ్గరుండి చూసుకుంటుందని మహేశ్ ఓ సందర్భంగా చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. మహేష్ కోసం తన కెరీర్ కి గుడ్ బై చెప్పేసింది నమ్రత. ఓ సాధారణ గృహిణిగా మారి గొప్ప ఇల్లాలుగా పేరు తెచ్చుకున్నారు. మహేష్, నమ్రత అంత ఆదర్శ దంపతులు వేరొకరు ఉండరేమో
Vishnupuri Colony : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ విష్ణుపురి కాలనీ వర్షాకాలం దరిచేరగానే వరద ముప్పుకు…
Shilajit In Ayurveda : ఆయుర్వేద శాస్త్రంలో ఎన్నో ఔషధ గుణాలను కలిగిన పదార్థాలు ఉన్నాయి. అలాంటి పదార్థమే శిలాజిత్.…
Patanjali Rose Syrup : ఎండాకాలం వచ్చిందంటే ఎక్కువ షరబతులని తాగుతూ ఉంటారు. కోకా లెమన్ షర్బత్ తాగుతూ ఉంటాం.…
Rohit Sharma : ఐపీఎల్-2025 లో సీఎస్కేతో తాజాగా జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ అద్భుత ప్రదర్శన కనబరిచి ఘన…
Gap In Teeth : కొన్ని శాస్త్రాలు పళ్ళ మధ్య కాలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు.…
Daily One Carrot : కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో దుంపలు కూడా ఒకటి. అవే…
Toothpaste : వెనుకటి కాలాలలో టూత్ పేస్ట్ అంటేనే తెలియదు. అప్పట్లో పండ్లను తోమాలంటే.. వేప కొమ్మలు, ఇటుక పొడి, బొగ్గు…
TGSRTC Jobs తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC)లో ఉద్యోగాల కోసం నిరీక్షణలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు…
This website uses cookies.