Mahesh Babu : టాలీవుడ్ జక్కన్న రాజమౌళి మరియు మహేష్ బాబు కాంబినేషన్ లో హాలీవుడ్ రేంజ్ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీ అన్నట్లుగా కాకుండా పాన్ వరల్డ్ మూవీ అంటూ జక్కన్న అధికారికంగా ప్రకటించాడు. ఇక సినిమాకు సంబంధించి షూటింగ్ కార్యక్రమాలు మొదలవ్వాల్సి ఉన్నాయి. షూటింగ్ కార్యక్రమాలు ఎప్పుడు మొదలవుతాయి అనే విషయంలో క్లారిటీ లేదు. వచ్చే ఏడాది అంటూ చిన్న హింట్ అయితే ఇచ్చారు, కానీ ఇప్పటి వరకు స్క్రిప్ట్ వర్క్ ఎక్కడ వరకు వచ్చిందని జక్కన్న రాజమౌళి క్లారిటీ ఇవ్వలేదు. ఇదే సమయంలో మహేష్ బాబును ఒక సీనియర్ జర్నలిస్ట్ ఈ సినిమా విషయంలో ప్రశ్నించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యంగా రాజమౌళి సినిమా అంటే హీరోలు కండలు చూపించి కొండలను పిండి చేస్తారా అన్నట్టుగా ఎక్సైజ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఆ విషయంలో ఎంత వరకు చేయబోతున్నారు, మీ ఫిజిక్ ఎలా ఉండబోతుంది అంటూ ప్రశ్నించాడట. ఆ సమయంలో మహేష్ బాబు స్పందిస్తూ.. ఇప్పటి వరకు జక్కన్న రాజమౌళి తనతో ఆ విషయాన్ని చర్చించలేదని.. పాత్రకు సంబంధించి ఫిజిక్ ఎలా ఉండాలి ఎలాంటి వర్కౌట్స్ చేయాలి ఎంతగా కష్టపడాలి అనే విషయాలు ఏవి కూడా ఇంకా మా మధ్య చర్చకు రాలేదని, ప్రస్తుతానికి స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లుగా మహేష్ బాబు తెలియజేశాడు. కథ కూడా పూర్తిగా తనతో చర్చించలేదని మహేష్ బాబు అన్నాడు. రాజమౌళినే ఇంకా కథ పూర్తిగా రెడీ చేసుకోలేదు.ఆయన కథ రెడీ చేసుకుని స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత తాను ఓకే అనుకుంటేనే అప్పుడు మహేష్ బాబు వద్దకు వెళ్తాడు.
ఒకసారి రాజమౌళి స్క్రిప్ట్ తీసుకొని మహేష్ బాబు వద్దకు వెళ్తే నూటికి నూరు శాతం తిరుగు లేకుండా మహేష్ బాబు ఓకే చెప్పే అవకాశం ఉందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. స్క్రిప్టు ఓకే అయిన తర్వాత అప్పుడు రాజమౌళి మహేష్ బాబుతో విషయంలో చర్చించే అవకాశం ఉంది. అలాగే యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నింటిని వివరించే అవకాశం ఉంది. అప్పటి వరకు మహేష్ బాబు తన త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉండవచ్చు. రాజమౌళి మరియు మహేష్ బాబు కాంబినేషన్ సినిమా కోసం కేవలం తెలుగు ప్రేక్షకులు మహేష్ బాబు అభిమానులు రాజమౌళి అభిమానులు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ సినీ ప్రేక్షకులు ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అనడంలో సందేహం లేదు.
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
This website uses cookies.