Home » Entertainment » Mahesh Babu Is Competiting With Pawan Kalyan
Entertainment

Mahesh babu : మహేష్ బాబు కి ఈసారి పవన్ కళ్యాణ్ తో పోటీ..అవసరమా అంటున్న ఫ్యాన్స్ ..?

Authored By
vamana sai
The Telugu News | Published on: February 4, 2021, 10:42 am
Advertisement

Mahesh babu : మహేష్ బాబు గత సంక్రాంతికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సినిమాకి పోటీగా సరిలేరు నీకెవ్వరు సినిమాని దింపాడు. మహేష్ బాబు సినిమా మంచి కమర్షియల్ హిట్ గా నిలిచింది. కాని అల్లు అర్జున్ అల వైకుంఠపురములో మాత్రం ఇండస్ట్రీ హిట్ సాధించి ఇప్పటికీ ఆల్బం పరంగా రికార్డుల మోత మోగిస్తూనే ఉంది. ఇద్దరి మధ్య పోటీ ఏమోగాని ఫ్యాన్స్ మాత్రం తెగ ట్రోల్ చేసుకున్నారు. అయితే మరోసారి ఇలాంటి పరిణామాలే ఎదురవనున్నాయని తెలుస్తోంది. మహేష్ బాబు మళ్ళీ తన సర్కారు వారి పాట తో బరిలో దిగబోతుండగా ఈ సారి పోటీ మాత్రం పవన్ కళ్యాణ్ సినిమాతో అని సమాచారం.

Advertisement

mahesh-babu- is competiting with pawan kalyan

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట ప్రస్తుతం దుబాయ్ లో షూటింగ్ జరుగుతోంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న ఆర్ధిక కుంభకోణాలు బ్యాక్ డ్రాప్ లో సర్కారు వారి పాట సినిమాని తెరకెక్కిస్తున్నాడు పరశురామ్. ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్.. జీఎంబీ ఎంటర్‌టైనన్‌మెంట్ .. మైత్రీ మూవీ మేకర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే రీసెంట్ గా ఈ సినిమాని 2022 సంక్రాంతి బరిలో దింపాలని మేకర్స్ డిసైడయ్యారు. ఆ విషయాన్ని వెల్లడిస్తే పోస్టర్ ని రిలీజ్ చేశారు.

Advertisement

Mahesh babu : మహేష్ బాబు వర్సెస్ పవన్ కళ్యాణ్ అని అంటున్నారు.

అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకి పోటీ ఏ సినిమా ఏది లేదని అనుకున్నారు. కాని ఆ సమయానికి పవన్ కళ్యాణ్ సినిమాతో మహేష్ కి పోటీ అని అంటున్నారు. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక పీరియాడికల్ సినిమా చేస్తున్నాడు. ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాతో పాటు యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వం లో కూడా పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు. దాంతో క్రిష్ సినిమా అక్టోబర్ లేదా నవంబర్ వరకు కంప్లీట్ అయ్యే అవకాశాలున్నాయి. దాంతో 2022 సంక్రాతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆ రకంగా ఈసారి మహేష్ బాబు వర్సెస్ పవన్ కళ్యాణ్ అని అంటున్నారు.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి