Mahesh Babu SS Rajamouli : దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి అలియాస్ జక్కన్న దేశ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి సిరీస్ తో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న రాజమౌళి రీసెంట్‌గా రామ్ చరణ్ – ఎన్టీఆర్ లను హీరోలుగా పెట్టి తీసిన ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ కీర్తిని సంపాదించుకున్నారు. కేవలం స్టార్ హీరోలనే కాదు కమెడియన్ కూడా కథనాయకుడిగా పెట్టి.. హిట్ కొట్టగల సత్తా రాజమౌళికి మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు మహేష్ బాబుతో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేసేందుకు రాజమౌళి ప్రణాళికలు రచిస్తున్నాడు.
ప్రస్తుతం రాజమౌళి స్క్రిప్ట్ వర్క్ లో ఉన్నారు. కాస్టింగ్, టెక్నీషియన్లని ఫైనల్ చేసే పనిలో ఉన్నారట. ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఆయన బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయి రెండేళ్లు అయిపోయింది. అయినా మహేష్ సినిమా స్టార్ట్ చేయకపోవడంతో ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదు. సినిమా ఎప్పుడు ప్రారంభమనేది కూడా క్లారిటీ లేదు. రైటర్ విజయేంద్రప్రసాద్ పలు మార్లు వచ్చే ఏడాది ప్రారంభమవుతుందని చెప్పారు. కానీ రాజమౌళి నుంచి వచ్చే ప్రకటనే క్లారిటీ ఉంటుంది. ఆయన ఎప్పుడు చెబుతారనేది పెద్ద సస్పెన్స్. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది.
మహేష్ సినిమాకి సంబంధించిన అప్ డేట్ రాబోతుందట. ఓ వార్త ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. జనవరి 26 వరకు ఓ క్లారిటీ వస్తుందట. ప్రచారం నిజమైతే ఆ రోజే ఈ మూవీ ప్రకటన ఉండబోతుందని తెలుస్తుంది. సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఇందులో నటిస్తున్నాడనే టాక్ వినిపించింది.. అలాగే ఒకప్పటి బాలీవుడ్ నటి, ఇప్పుడు గ్లోబల్ బ్యూటీగా రాణిస్తున్న ప్రియాంక చోప్రా పేరు కూడా లీక్ అయ్యింది. కానీ ఇందులో నిజం లేదని సమాచారం. విక్రమ్ పేరు కూడా ఆ మధ్య చక్కర్లు కొట్టింది. అది కూడా క్లారిటీ లేదు. మరోవైపు ఇందులో హాలీవుడ్ హీరోయిన్ నటించబోతుంది, న్యూజిలాండ్ హీరోయిన్ చెల్సియా ఎలిజబెత్ పేరు ప్రధానంగా వినిపించింది. కానీ దీనిపై కూడా ఎలాంటి క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో అన్ని కుదిరితే జనవరి 26న క్లారిటీ వస్తుందని సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Peerzadiguda : మన్మోహన్ సింగ్ గారికి నివాళులు అర్పించిన అధ్యక్షులు తుంగతుర్తి రవి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను…
Sankranti Bus : సంక్రాంతి పండుగ అంటే ఎలా ఉంటుందో తెలుగు ప్రజలకు చెప్పనక్కర్లేదు. ఇందుకోసం సొంతూళ్లకు వెళ్లేందుకు ముందుగానే…
Egg : మనల్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుటకు మంచి ప్రోటీన్ ఆహారాన్ని తీసుకోవాలి. అయితే గుడ్లను తినేటప్పుడు కొంతమంది కొన్ని…
2024 Rewind : ఈ ఏడాది ఫుట్ బాల్ ప్రపంచం నివ్వెరపోయేలా చేసిన సంఘటనలు కొన్ని ఉన్నాయి. ఫుట్బాల్ ప్రపంచకప్…
Health Tips : ఈ రకపు గింజలను తీసుకోవడం వలన దీర్ఘకాలికంగా బాధపడుతున్న వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు అని…
Mad Square Movie : సితార బ్యానర్ లో కొత్త వారితో తెరకెక్కిన మ్యాడ్ సినిమా సూపర్ హిట్ అయ్యింది.…
NABFINS Jobs : నాబార్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (NABFINS) కేరళలోని కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి nabfins.orgలో…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలు వ్యక్తిగత జీవితంలో గ్రహాల మార్పులు మనుషుల వ్యక్తిగత జీవితాల పైన ప్రభావం…
This website uses cookies.